Samantha : ఓరి దేవుడో సమంతకు ఏమైంది మళ్లీ.. ఫోటో వైరల్..

- Advertisement -

టాలివుడ్ స్టార్ హీరోయిన్ Samantha తాజాగా త‌న అభిమానుల‌కు, సినీ ల‌వ‌ర్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఏడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని ఆమె చెప్ప‌టం అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. గ‌త కొంత కాలంగా ఆమె మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతుంది. ఆ మ‌ధ్య దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ‌గా ఉండ‌టంతో సినిమాల‌కు దూరమైంది. అయితే త‌ర్వాత ఆరోగ్యం కుదుట‌ప‌డ‌గానే విజ‌య్ దేవ‌ర‌కొంండ సినిమా ఖుషి సినిమాను పూర్తి చేసేసింది. ఇక సిటాడెల్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉంది. దీని త‌ర్వాత ఏ సినిమాకు ఆమె ఓకే చెబుతుందోన‌ని అంద‌రూ ఎదురు చూస్తున్న త‌రుణంలో ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటున్నాన‌ని చెప్పి షాకిచ్చింది.. ఇందుకు సంబందించి రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Samantha
Samantha

ఇకపోతే తాజాగా ఈ అమ్మడు ముంబై ఎయిర్ పోర్టులో ఆమె క‌నిపించింది. అయితే ముఖానికి మాస్క్ వేసుకుని మీడియాను అవాయిడ్ చేసి వెళ్లిపోయింది. అస‌లు స‌మంత ముంబై ఎందుకు వ‌చ్చింది.. షూటింగ్ కోసం వచ్చిందా..? లేదా ఇంకేదైనా ఉందా? ఏడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉండ‌టం అంటే మాటలు కాదు.. అమెరికాకు ఏమైనా ట్రీట్‌మెంట్‌కు వెళుతుందా? అని ప్ర‌శ్న‌లు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలిచేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత ఒక పోస్ట్ పెట్టింది.. అది కాస్త చర్చనీయాంశంగా మారింది..

samantha

ఆ ఫోటోలలో సమంత బాగా సన్నగా కనిపిస్తుంది.. ముఖం అంతా పీక్కువపోయి క‌నిపిస్తోంది. దీంతో పాటు ఈ ఆరు నెలలు చాలా క‌ష్ట‌త‌రంగా గ‌డిచాయనే మెసేజ్‌ను కూడా ఆమె పోస్ట్ చేసింది. అసలు సమంతను అలా చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. బీ స్ట్రాంగ్ అని చెబుతున్నారు. సమంత పర్టికులర్‌గా 6 నెల‌లు క‌ష్టంగా గ‌డిచింద‌ని మెసేజ్ పెట్ట‌టానికి కార‌ణం.. ఆమె గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్‌లో పాల్గొంటూ వ‌చ్చింది.. ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఇక మళ్లీ ఎప్పుడూ సినిమాలు చేస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here