సమంత ఇక అలాంటి పనులకు పనికిరాదా..? అందుకు లేటెస్ట్ ఉదాహరణ ఇదే!

- Advertisement -

సౌత్ లో స్టార్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత. ‘ఏం మాయ చేసావే’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన హాట్ బ్యూటీ తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇలా అందరి హీరోల సరసన కలిసి నటించిన సమంత, తమిళం లో కూడా దాదాపుగా అందరి హీరోలతో నటించి అతి తక్కువ సమయం లోనే సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.

సమంత
సమంత

ఇప్పుడు ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి అది హిట్ అయితే కచ్చితంగా 40 కోట్ల రూపాయిలు షేర్ ని కొల్లగొట్టే రేంజ్ మార్కెట్ ఉంది. కానీ నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆడియన్స్ ఈమెని చూసే తీరు పూర్తి గా మారిపోయింది.

‘రంగ స్థలం ‘ చిత్రం తర్వాత సమంత ఎంచుకుంటున్న సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ మరియు విలన్ రోల్స్ ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి సమంత ని ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ హీరోయిన్ గా చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా లేరని రీసెంట్ గా విడుదలైన ‘ఖుషి’ చిత్రం నిరూపించింది. మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ అనే చెప్పొచ్చు. సినిమా బాగున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగలడానికి కారణం సమంత అని అంటున్నారు విశ్లేషకులు. ఆమె రొమాన్స్ చేయడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందని అంటున్నారు. మరోపక్క నెటిజెన్స్ నీకు ఇలాంటి రోల్స్ ఇక పనికి రావు, పొయ్యి విలన్ రోల్స్ చేసుకో అంటూ సమంత పై కామెంట్స్ చేస్తున్నారు.’యశోద’ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘శాకుంతలం‘ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత విడుదలయ్యే ‘ఖుషి’ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అనుకుంటే ఈ సినిమా కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. మరి సమంత రాబొయ్యే సినిమాలతో అయినా కం బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com