Samantha: బాలీవుడ్ లో సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!! తెలుగు స్టార్ హీరోస్ కంటే ఎక్కువే…

- Advertisement -

Samantha: హీరోయిన్ సమంత ఇప్పుడు నేషన్ వైడ్ ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకే పరిమితం అయిన సమంత ఇప్పుడు బాలీవడ్ లో కూడా తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సమంత తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో చాలాపెద్ద చర్చ జరుగుతుంది. తెలుగులో ఉండే స్టార్ హీరోస్ కంటే ఎక్కువగా ఆమె రెమ్యూనరేషన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.samantha

హిందీలో ఇప్పుడు “సిటాడెల్ హనీ బన్నీ” అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెరికన్ సిటాడెల్ కు ఇండియన్ వెర్సన్ లాంటిది. ఈ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ లో సమంతతో పాటు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నారు. ఆ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. latest news about samantha citadel web series in bollywoodఫ్యామిలీ మ్యాన్, ఫార్జి లాంటి సిరీస్ తీసిన వీళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తుండటంతో దీనిపై ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ లో నటించడానికి సమంత దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. తెలుగులో ఉన్న టైర్ 2 హీరోస్ కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు.

సమంతకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరువాత బాలీవుడ్ లో మంచి పాపులారిటీ వచ్చింది. దింతో సమంత ఈ రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన సిటాడెల్ ట్రైలర్ కు చాలామంచి స్పందన వస్తుంది. ఈ సిరీస్ కూడా హిట్ అయితే బాలీవుడ్ లో సమంత రేంజ్ ఇంకా పెరుగుతుంది. హెల్త్ ఇష్యూల కారణంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా ఈ రేంజ్ లో కష్టపడటం మాత్రం సమంతకే సాధ్యమని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here