స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏం మాయ చేసావే సినిమాతో నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ అందరిని తన అభిమానులు చేసుకున్న గొప్ప నటి సమంత. ఆ సినిమా దగ్గర నుంచి చైతుతో మంచి రిలేషన్ ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమించుకుని ఏడు సంవత్సరాల పాటు ఆ ప్రేమను కొనసాగించి.. ఆ తర్వాత అక్కినేని కుటుంబాన్ని ఒప్పించి.. అక్కినేని నాగార్జునకు కోడలిగా, అక్కినేని నాగచైతన్యకు భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది.
వీళ్ళ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా నాలుగేళ్ల వరకు గడిచింది. అంతే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కొన్ని సమస్యలు కలిగి ఒకరికి ఒకరు దూరమై విడాకులు తీసుకునేంతవరకు వెళ్లి.. చివరికి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి సమంత జీవితం ఇంకొక మలుపు తిరిగింది. విడాకుల తర్వాత సమంత తన కెరీర్ మీద ఎక్కువ శ్రద్ధను పెట్టుకుంటూ.. ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కానీ మధ్యలో ఆమెకు అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
సమంత గురించి ఒక ట్వీట్ చూసి నెటిజనులు ఆశ్చర్యపోయారు. ఇది నిజమేనా అంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు ఒక ట్వీట్ చేశాడు. అతను సమంత గురించి మాట్లాడుతూ.. సమంత నాగ చైతన్యని మర్చిపోలేక.. ఆ క్రమంలో సమంత చాలాసార్లు సూసైడ్ అటెండ్ చేసిందంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు సమంత ప్రస్తుతం డిప్రెషన్ లో ఉందని కూడా చెప్పాడు. ఇది చూసిన సమంత అభిమానులు ఎంత చైతూని మర్చిపోలేక పోతే మాత్రం.. సూసైడ్ చేసుకోవాల్సిన ఖర్మ ఎం పట్టింది? అని అంటున్నారు.