Samantha : సమంత నాగచైతన్య ప్రేమ పెళ్లి విడాకులు అనేది ఇండస్ట్రీలో ఒక పీడకలలా మారిపోయింది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని అందరిని బాధపెట్టారు. ఇక విడాకులు అయ్యాక ఇటు సమంతా గాని అటు నాగచైతన్యగాని తమ విడాకులకు సంబంధించిన అసలు కారణాలు బయట పెట్టలేదు.కానీ సమంత మాత్రం అవి చీకటి రోజులు అంటూ తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అంతే కాదు ఓ సోలో పాల్గొన్న సమంత నన్ను నాగచైతన్యను ఒకే రూమ్లో ఉంచితే అక్కడ పదునైన కత్తులు వస్తువులు వంటివి ఉండకూడదు.అంటూ చెబుతూ నాగచైతన్య మీద తన కోపాన్ని స్వయంగా బయటపెట్టింది.

విడాకుల విషయంలో తప్పు కొంతమంది నాగచైతన్య దే అంటే మరీ కొంతమంది సమంతాది తప్పు అంటూ ఇలా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని వైరల్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా నాగచైతన్య గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య చాలా రోజులు గదిలోని కూర్చుని ఏడ్చాడట..అంతేకాదు సమంతతో ఉన్న జ్ఞాపకాలను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఎక్కి ఎక్కి ఏడ్చాడట.

ఈ విషయంలో నాగచైతన్య కుటుంబంతో పాటు స్నేహితులు సన్నిహితులు ఎంతమంది ఓదార్చినా కూడా తన బాధ నుండి ఆయన బయటపడలేదట. అయితే ప్రస్తుతం ఈ విషయం బయటపడడంతో సమంత చేసిన పనికి నాగచైతన్య అంతలా బాధపడ్డారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అంతేకాదు సమంత చేసిన పని వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడు. సమంతానే విడాకులు కావాలని తీసుకుంది.అక్కినేని ఫ్యామిలీలో పద్ధతి గల కోడలిగా ఉండు అంటే అది నచ్చకపోవడంతో విడాకులు కోరి మరి తీసుకుంది.అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాదు సమంత ఏ ఇంటర్వ్యూలో కూడా నాగచైతన్య గురించి మంచిగా మాట్లాడలేదు.కానీ నాగచైతన్య మాత్రం ఆయన పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో కూడా సమంతా గురించి ప్రస్తావన వస్తే ఒక నవ్వు నవ్వి పాజిటివ్గా మాట్లాడుతారు. కానీ ఏ రోజు కూడా సమంతని నిందించలేదు. ఇక ఈ విషయంలో తప్పు మొత్తం సమంతాదే అంటూ కొంతమంది అక్కినేని అభిమానులు సమంతా పై విమర్శలు చేస్తున్నారు.