Samantha : చదువుకునే రోజుల్లో మా అన్నయ్య నన్ను టార్చర్ చేసేవాడు అంటూ సమంత షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Samantha : సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఈమె గురించి మన తెలియని విషయం అంటూ ఏది లేదు. సమంత జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆమె కెరీర్ లో సాధించిన విజయాలు, ఆమె నడిపిన లవ్ అఫైర్స్, పెటాకులు అయిన వివాహ బంధం, ఇలా అన్నీ కూడా అభిమానులకు తెలుసు.

Samantha
Samantha

ఈమె కెరీర్ లో ఎదురుకున్నని ఒడిదుడుకులు ఏ హీరోయిన్ కూడా ఈ జనరేషన్ లో ఎదురుకోలేదు అని చెప్పడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్ గానే ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధి తో పోరాడి చావుని జయించిన ఈమె సినిమాలకు విశ్రాంతి కోసం తాత్కాలిక విరామం ఇచ్చింది. అతి త్వరలోనే ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సమంత కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Samantha Updates

అదేమిటంటే సమంత కి జోనాథన్ ప్రభు, డేవిడ్ ప్రభు అని ఇద్దరు అన్నయ్యలు ఉండేవారట. వయస్సులో వీళ్లిద్దరు సమంత కంటే చాలా పెద్ద అట. సమంత కి సంబంధించిన ప్రతీ విషయం లోను వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. ముఖ్యంగా చదువుకునే రోజుల్లో సమంత చేసే అల్లరి కి వీళ్లిద్దరు బాగా కొట్టేవారట. అంతే కాకుండా సమంత కాలేజీ వయస్సుకి వచ్చినప్పుడు ప్రతీ రోజు వీళ్ళే దగ్గరుండి తీసుకొని వెళ్లి, మళ్ళీ తిరిగి ఆమెని తిరిగి తమ బైక్ లో ఎక్కించుకొని వచ్చేవారట.

- Advertisement -
Samantha  Brother

ఎవరైనా అబ్బాయితో మాట్లాడితే అసలు ఊరుకునేవాళ్ళు కాదట. సమంత వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా వాళ్లకు వార్నింగ్ ఇచ్చేవారట. ఒకానొక సందర్భంలో సమంత కి లైన్ వేస్తున్న ఒక్క అబ్బాయిని గమనించి చితకబాదాడు అట. అలా ఇంట్లో ఆమెకి ఇద్దరు హిట్లర్ లాంటి అన్నయ్యలు ఉండేవారని, చిన్నప్పుడు టార్చర్ చూపించేవారని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here