Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మైయోసైటిస్‌తో బాధపడుతున్నందున, ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి సమంతా సినిమా పరిశ్రమ నుండి చిన్న విరామం తీసుకుంది. సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఈ వ్యాధికి వివిధ దేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో సమంత మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నా కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.. ఈ విధంగా సమంత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
తను ఎక్కడికి వెళ్ళిన అక్కడి ఫోటోలను ఇన్ స్టా లో పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరగా వుంటుంది. తాజాగా సమంత తన తొలి ప్రేమకు సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియాలో వెల్లడించింది. నాగ చైతన్య తన మొదటి ప్రేమ కాదని, రెండేళ్లుగా తన వెంట ఓ వ్యక్తి పడ్డాడని, తనను ప్రేమించానని సమంత చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సమంత చదువుకునే రోజుల్లో పల్లవరం నుంచి టీనగర్ వెళ్లాలంటే రెండు బస్సులు మారాల్సి వచ్చేది. సమంత కోసం ఓ కుర్రాడు రోజూ బస్టాప్‌లో వేచి ఉండేవాడట. ఆ విధంగా తన స్కూల్‌కి వెళ్ళే దారిలో ఫాలో అయ్యే వాడని, స్కూల్‌కి కొంచెం ముందే వెళ్లి వెనక్కి తిరిగేవాడని సమంత తెలిపింది. రెండేళ్లుగా పిచ్చివాడిలా తిరిగాడని, అయితే ఒకరోజు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని అడగ్గా, నీ వెంట పడుతున్న అని చెప్పడంతో షాక్ తిన్నానని సమంత చెప్పింది. అది ప్రేమో కాదో తెలియదు కానీ నాకు మాత్రం అది తొలి ప్రీమే అంటూ సమంత చెప్పింది. అయితే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త విన్న నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.. నాగ చైతన్య ఫస్ట్ లవ్ కాదా సమంతా అంటూ కామెంట్లు చేస్తున్నారు.