Ram Charan కి అత్తగా సమంత..ఈ ఆలోచన చేసిన డైరెక్టర్ నిజంగా మహానుభావుడే!

- Advertisement -

Ram Charan సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఇమేజి , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు కచ్చితంగా ఉంటుంది. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ తోనే ఈమెకి స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వరుసగా ఈమెకి స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ దక్కింది.

అలా అతి తక్కువ సమయం లోనే తెలుగు లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత తమిళం లో కూడా ఈమెకి వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వచ్చింది. అలా తెలుగు , తమిళ భాషల్లో సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న సమంత ఈమధ్యనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే రంగస్థలం చిత్రం నుండి సమంత ఎంచుకుంటున్న స్క్రిప్ట్ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది.

ఎక్కువగా ఆమె నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తుంది. అందులో నెగటివ్ రోల్స్ కూడా ఉన్నాయి. అయితే అతి త్వరలోనే రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు లీక్ అయ్యి సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. రీసెంట్ గానే ఈ సినిమాలో ఒక పాత్ర కోసం సమంత ని అడగడానికి వెళ్ళాడట డైరెక్టర్ బుచ్చి బాబు.

- Advertisement -

కథ విన్న తర్వాత సమంత కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎందుకంటే బుచ్చి బాబు తనకి హీరోయిన్ రోల్ ఆఫర్ ఇచ్చేందుకు వచ్చాడేమో అని సమంత అనుకుంది. కానీ హీరోయిన్ రోల్ కాకుండా రామ్ చరణ్ కి అత్తా తరహా పాత్ర కోసం అడిగాడట. కథ మొత్తం విన్న తర్వాత రామ్ చరణ్ కి అత్త గా నేను ఎలా చేస్తానని అనుకున్నావ్?, ఈమధ్య నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నానని ఇలాంటి క్యారెక్టర్స్ కి అడుగుతావా అని మండిపడింది అట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here