Samantha – Sreeja : ఇటీవల కాలం లో విడాకులు తీసుకుంటున్న సెలెబ్రిటీల జాబితా రోజు రోజుకి పెరిగిపోతుంది.ముఖ్యంగా సమంత నాగ చైతన్య తో విడిపోవడం, అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజా కళ్యాణ్ దేవ్ తో విడిపోవడం సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.ఎందుకంటే వీళ్లిద్దరు పాపులర్ సెలెబ్రిటీలు కాబట్టి.అయితే వీళ్లిద్దరు తమ భర్తలతో విడిపోవడానికి కారణం ఒకరే అట.పూర్తి వివరాల్లోకి వెళ్తే సమంత కి హెయిర్ స్టైలిస్ట్ గా ప్రీతం జూకాల్కర్ వ్యవహరిస్తూ వస్తున్నాడు.

సమంత తో అతను ఎంతో క్లోజ్ గా ఉండడంని చూసిన నాగ చైతన్య జీర్ణించుకోలేకపోయాడని, అతని వల్ల తరుచూ గొడవలు జరిగేవని, అందుకే విడిపోవాల్సి వచ్చిందంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ జోరుగా ప్రచారం అయ్యింది.అయితే ఈ రూమర్స్ పై ప్రీతం జూకాల్కర్ ఇంస్టాగ్రామ్ లో స్పందిస్తూ సమంత నాకు అక్కలాంటిది, ఆమెని నేను అక్కా అక్కా అనే పిలుస్తాను.అలాంటి మా మధ్య ఇలాంటి సంబంధాలు పెట్టడం కరెక్ట్ కాదు అంటూ అప్పట్లో ప్రీతం జుకల్కర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.

అయితే ఈ ప్రీతం జూకాల్కర్ అనే అతను శ్రీజ కొణిదెల కి కూడా వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్. ఈమెతో కూడా ఆయన చాలా క్లోజ్ గా ఉండేవాడు, అందుకు సంబంధించిన ఫోటోని మీరు క్రింద చూడవచ్చు. అలా శ్రీజా తో ఇతగాడు క్లోజ్ గా మెలగడం కళ్యాణ్ దేవ్ కి కూడా నచ్చలేదట, అందుకే వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయారని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

అలా ఈ ఇద్దరి సంసార జీవితాల్లో ప్రీతం జూకాల్కర్ చిచ్చు పెట్టాడని, ఇతను వల్లే వాళ్లిద్దరూ తమ భర్తలతో విడిపోవాల్సి వచ్చిందని సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారం అవుతుంది. అయితే ఒక అమ్మాయి – అబ్బాయి క్లోజ్ గా ఉన్నంత మాత్రానా వాళ్ళిద్దరి మధ్య ఎదో నడుస్తుందని అనుకోవడం అవివేకం అని, ఈరోజుల్లో కూడా జనాలు ఇలా ఆలోచిస్తున్నారా అంటూ ఈ వార్త తెలుసుకున్న నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
