Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ కు ఏమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తొలి సినిమాతోనే హిట్ తన ఖాతాలో వేసుకున్న తర్వాత వరుస సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే అమ్మడు హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వారు బతుకుతున్నారు. ఆ తర్వాత జరిగిన సంగతులు రోజు ఏదో ఒక రూపంలో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ సరదాగా ముచ్చటిస్తుంటుంది. అంతే కాకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేయడం, తన బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో సరదాగా గడపడం సమంతకు ఇష్టం. ముఖ్యంగా ఇండస్ట్రీలో సమంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సింగర్ చిన్మయి. సమంత, చిన్మయి చాలా క్లోజ్‌గా ఉంటారు. సమంత తనకు సమయం దొరికినప్పుడు చిన్మయి వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల పిల్లలతో ఆడుకుంటుంది. అంతే కాకుండా చిన్మయి భర్త కూడా సామ్‌కు మంచి స్నేహితుడు.
అయితే తాజాగా రాహుల్ హీరోగా.. సమంత హీరోయిన్ గా రొమాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి ఓ తమిళ మూవీలో నటించారు. కాగా, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంది. అందులో వీరి కాంబినేషన్ అదిరిపోయింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చిన్మయికి షాక్.. సమంత, రాహుల్ రొమాన్స్ చేస్తూ ఇలా దొరికిపోయారేంటి అని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీరిద్దరూ కలిసి నటించారా అని ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram