Samajavaragamana: ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం విడుదల అవుతున్న పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి బయ్యర్స్ ని నిండా ముంచేయగా, చిన్న సినిమాలే వాళ్ళని ఇప్పుడు ఆదుకుంటున్నాయి. అలా రీసెంట్ సమయం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతున్న సినిమా ‘సామజవరగమనా’.

యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో మంచి వసూళ్లు వస్తున్నాయి. కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, 10 రోజులకు గాను పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించింది. అంటే రోజుకి సగటున కోటి రూపాయిలు అన్నమాట. శ్రీవిష్ణు కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చెప్పుకోవచ్చు, ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం బయ్యర్స్ పాలిట బంగారు బాతు లాగ తయారు అయ్యింది.

కేవలం పాతిక లక్షల రూపాయలకు ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్నారు. రెండవ వీకెండ్ లోకి అడుగుపెట్టేలోపు ఈ సినిమా రెండు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. అంటే పెట్టిన డబ్బులకు 5 రెట్లు లాభం అన్నమాట, ఈమధ్య కాలం లో ఈ స్థాయి లాభాలను తెచ్చిపెట్టిన సినిమానే లేదట. ఇప్పటి వరకు అమెరికన్ డాలర్స్ రూపం లో ఈ చిత్రం 7 లక్షల 20 వేల డాలర్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 8 లక్షల రూపాయలకు పైగా డాలర్స్ ని రాబట్టే ఛాన్స్ ఉందట.

2021 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్‘ చిత్రానికి అమెరికా లో 7 లక్షల 80 వేల డాలర్స్ వచ్చాయి. అప్పట్లో పీక్ కరోనా రావడం, థియేటర్స్ మొత్తం కేవలం 30 శాతం ఆక్యుపెన్సీ తో రన్ అవ్వడం వల్ల అంత తక్కువ వసూళ్లు వచ్చాయి, అయితే ఇప్పుడు ‘సామజవరగమనా‘ చిత్రం వకీల్ సాబ్ ఫుల్ రన్ అమెరికా కలెక్షన్స్ ని దాటేస్తుందని అంటున్నారు,చూడాలి మరి.
