Salaar : సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న స్టార్ హీరో.. దురదృష్టం అంటే ఈయనగారిదే

- Advertisement -


Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సలార్. ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ని ఒక స్థాయికి ఎలివేట్ చేశాడు. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్ట్ చేసిందంటే సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమాని ప్రభాస్ కాకుండా మరో స్టార్ హీరోతో చేయాలని మొదట ప్రశాంత్ ప్లాన్ చేశాడట.

ఆ హీరో కాకుండా ప్రభాస్ తోనే ప్రశాంత్ సలార్ సినిమా తీశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన అతనిని ఎందుకు మార్చారు? చూద్దాం. ఆ హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. సూర్య కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నప్పుడు ఈ కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని దర్శకత్వ శాఖలో ఒకరు సూచించారు. అతని సూచన విన్న ప్రశాంత్ రోజంతా స్క్రిప్ట్‌లో ప్రభాస్‌ని ఊహించుకున్నాడట.

నిజంగానే ఈ సినిమాకి రెబల్ స్టార్ అయితే పర్ఫెక్ట్ అని భావించిన దర్శకుడు.. వెంటనే ప్రభాస్ కి కథ చెప్పాడట. ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం 1000 కోట్ల కలెక్షన్స్ బాటలో నడుస్తోంది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సూర్య చేయవలసిన బ్లాక్ బస్టర్ మూవీని ప్రభాస్ చేశాడా అంటూ.. ఈ సినిమాకు నిజంగానే ప్రభాస్ ఫర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడంటూ.. సూర్య చేసి ఉంటే ఈ సినిమా అంత సక్సెస్ వచ్చేది కాదు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here