Salaar Movie Review : ‘సలార్’ మూవీ ఫుల్ రివ్యూ..అనుకున్న స్థాయిలో లేదు కానీ చివరి 40 నిమిషాలు వేరే లెవెల్!

- Advertisement -

నటీనటులు : ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి , బాబీ సింహా తదితరులు.

దర్శకత్వం : ప్రశాంత్ నీల్
సంగీతం : రవి బర్సుర్
బ్యానర్ : హోమబుల్ ఎంటర్టైన్మెంట్స్

Salaar Movie Review : బాహుబలి సిరీస్ తర్వాత ఎవరి దిష్టి ప్రభాస్ కి తగిలిందో తెలియదు, ఆ సిరీస్ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. వందల కోట్ల రూపాయిల నష్టాన్ని వాటిల్లేలా చేసాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ చిత్రం కోసం ఎంతో ఆతృతగా మూడేళ్ళ నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్దమైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 22 కి వాయిదా పడాల్సి వచ్చింది. వాయిదా పడినప్పటికీ కూడా ఈ చిత్రం పై అటు ఫ్యాన్స్ లో కానీ, ఇటు ఆడియన్స్ లో కానీ అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలై ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఈ రివ్యూ లో చూడండి.

- Advertisement -

కథ :

దేవా (ప్రభాస్) తన తల్లితో కలిసి టిన్యూకియా లో ఒక మెకానిక్ గా సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఆయనకీ ఆద్య (శృతి హాసన్ ) అనే ప్రేమికురాలు కూడా ఉంటుంది. అయితే ఈమె కోసం కన్సార్ సిటీ కి చెందిన వర్ధరాజ్ మన్నార్ (పృథ్వీ రాజ్ సుకుమారన్) మనుషులు వెతుకుతూ ఉంటారు. ఆమె పై దాడి చేయాలనుకునే క్రమం లో వర్ధరాజ్ మన్నార్ మనుషులను అడ్డుకొని వాళ్ళతో ఫైట్ చేస్తాడు దేవా. అప్పుడే దేవా మరియు వర్ధరాజ్ మన్నార్ గతం లో ప్రాణ స్నేహితులు అనే విషయం తెలుస్తుంది. అంత ప్రాణ స్నేహితులుగా ఉండే ఈ ఇద్దరు ఎందుకు భద్ర శత్రువులు అయ్యారు?, ఆద్య కోసం వర్ధరాజ్ మన్నార్ ఎందుకు వెతుకుతున్నాడు. స్నేహితులిద్దరు మళ్ళీ ఒకటి అవుతారా? లేకపోతే భద్ర శత్రువులు గానే మిగిలిపోతారా అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి తన సినిమాల్లో పాత్రలను బలంగా రాసుకోవడం ఆయనకి బాగా అలవాటు. ఈ చిత్రం లో కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలను డెవలప్ చేసుకోవడానికి స్కోప్ తీసుకున్నాడు. సినిమా ప్రారంభం లో ప్రభాస్ మరియు పృథ్వీ రాజ్ సుకుమారన్ చిన్నతనం లో వచ్చే సన్నివేశాలను అద్భుతంగా రాసుకున్నాడు. సినిమాలో ప్రభాస్ అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తాడు. ఇంటర్వెల్ వరకు చాలా సామాన్యుడిగా, అసలు పెద్దగా ఎలివేషన్స్ ఏమి లేకుండా ప్రభాస్ క్యారక్టర్ ని చూపిస్తారు. కానీ ఇంటర్వెల్ కి 15 నిమిషాల ముందు నుండి ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ వేరే లెవెల్ లో చూపిస్తాడు. ముఖ్యంగా కోల్ మైన్ లో వచ్చే ఫైటింగ్ సీన్ ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ ఫైట్ సన్నివేశం తప్ప ఫస్ట్ మొత్తం పర్లేదు అనే రేంజ్ లో మాత్రమే ఉంటుంది.

ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ప్రభాస్ మరియు పృథ్వీ రాజ్ మధ్య ఫ్రెండ్ షిప్ సన్నివేశాలను ఎమోషనల్ గా రాసుకుంటాడు డైరెక్టర్. ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం సెకండ్ హాఫ్ లో గంట నిడివి పైనే ఉంటుంది. ఎందుకో ఈ గంట నిడివి సినిమా చాలా సాగదీసినట్టు ఎలాంటి హై లేకుండా సింపుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తాది. కానీ చివరి 40 నిమిషాలు మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలా అయితే చూపించాలని అనుకున్నాడో, అలా చూపించాడు. ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగా పండాయి, క్లైమాక్స్ ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. సినిమా మొత్తం మీద పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది రవి బర్సుర్ అందించిన సంగీతం అనే చెప్పాలి. సినిమాకి మెయిన్ హైలైట్ గా నిల్చిన కోల్ మైన్ పోరాట సన్నివేశం లో రవి బర్సుర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా నీరసంగా ఉంది. అంతే కాకుండా సినిమా నిడివి కూడా తగ్గించి ఉండుంటే బాగుండేది అని అనిపించింది.

చివరి మాట :

ఓవరాల్ గా సినిమా బాగుంది. ప్రభాస్ గత మూడు చిత్రాలకంటే ఈ సినిమా వెయ్యి రెట్లు బెటర్. రెండు మూడు ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేస్తుంది. కేజీఎఫ్ సిరీస్ రేంజ్ లో అయితే సినిమా లేదు కానీ, కచ్చితంగా బాహుబలి తర్వాత ప్రభాస్ బెస్ట్ అని చెప్పొచ్చు .

రేటింగ్ : 3/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here