Salaar : హిందీ లో ‘సలార్’ కి 100 కోట్లు కూడా రాలేదా..బయటపడ్డ నిర్మాతల ఫేక్ కలెక్షన్స్!

- Advertisement -

Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ దాదాపుగా ముగిసిపోయినట్టే. ఓపెనింగ్స్ పరంగా బాలీవుడ్ బడా ఖాన్స్ రాజ్యం కి కూడా వణుకుపుట్టించిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో మాత్రం అదే రేంజ్ ఊపుని చూపించలేకపోయింది. ఓపెనింగ్స్ వసూళ్లను చూసి, కచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్ నుండి మరో వెయ్యి కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే సినిమా అవుతుంది అనుకున్నారు. కానీ అది జరగలేదు.

లాంగ్ రన్ సంగతి అటు ఉంచితే, హిందీ లో ఈ సినిమాకి స్వయంగా ‘సలార్’ నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ ని వెయ్యిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈమధ్య కాలం లో ఖాన్స్ తమ సినిమాలకు బాలీవుడ్ లో కార్పొరేట్ బుకింగ్స్ పద్దతి ని అనుసరిస్తున్నారు. అంటే జనాలకు బదులుగా కార్పొరేట్ సంస్థలు కొన్ని సీట్స్ ని బ్లాక్ చేసి వదులుతుంటాయి అన్నమాట.

అయితే ఈ పద్దతిని బాలీవుడ్ ఖాన్స్ తమ సినిమాలకు కేవలం ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని చూపించుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఫుల్ రన్ లో మాత్రం ఆ పద్దతిని అనుసరించారు, జనాలు నిజంగా తెంపే టికెట్స్ మీదనే సినిమా థియేట్రికల్ రన్ ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ‘సలార్’ కి మాత్రం మొదటిరోజు నుండి నేటి వరకు కార్పొరేట్ బుకింగ్స్ ని చెయ్యిస్తునే ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ షోస్ తెలుగు వెర్షన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ గ్రాస్ ప్రతీ రోజు నమోదు అవుతుండడం విశేషం.

- Advertisement -

నార్త్ ఇండియా లో కేవలం ఈ రెండు చైన్స్ నుండే అంత గ్రాస్ వస్తుంది, మిగిలిన సింగల్ స్క్రీన్స్ మరియు మల్టీప్లెక్సుల నుండి కనీస స్థాయి గ్రాస్ వసూళ్లు కూడా రావడం లేదు. ఇక్కడే అందరికీ అర్థం అయ్యుండాలి, ఎలాంటి స్కాం జరుగుతుందో అనేది. ఇదంతా చూస్తూ ఉంటే, ‘సలార్’ కి హిందీ లో కనీసం 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా రాలేదని అనిపిస్తుంది అంటూ ట్రేడ్ పండితులు కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here