Sai Pallavi : గత మూడు రోజుల నుంచి సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఓ డైరెక్టర్ ని సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, అందుకు సంబంధించిన ఫోటో ఇదే అని, వారిద్దరూ దండలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి వైరల్ చేశారు. దీంతో చాలామంది నిజంగానే సాయి పల్లవి పెళ్ళి అయిపోయిందని నమ్మేశారు.
అసలు ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు ఎవరరో కూడా పట్టించుకోలేదు? అసలు విషయం ఏంటంటే, ఆ ఫోటో ఓ సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా తీసింది. ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఓ సినిమాకి పూజా కార్యక్రమం చేస్తున్నారంటే చిత్ర యూనిట్ మొత్తానికి దండలు వేసి.. పండితులు వారిని ఆశీర్వదిస్తారు. అలా చిత్ర బృందం మొత్తం నిలబడి ఉన్న ఫోటోలో కేవలం డైరెక్టర్, సాయి పల్లవి ఫోటోలు కట్ చేసి పెళ్లి ఫోటోగా చిత్రీకరించారు.
దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ న్యూస్ పై సాయి పల్లవి రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. “నిజం చెప్పాలంటే నేను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోను. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితుల జోలికొస్తే నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి పెయిడ్ బోట్స్‌తో ప్రచారం చేయడం పూర్తిగా నీచమైంది” అంటూ తన ట్విట్టర్లో రాస్కొచ్చింది సాయి పల్లవి.