Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. భానుమతి హైబ్రిడ్ పిల్ల.. సింగల్ పీస్ అన్న డైలాగుతో బాగా పాపులర్ అయింది. ఆ సినిమా డైలాగ్ లాగే.. ఇండస్ట్రీలో కూడా సాయిపల్లవిలా ఎవరూ ఉండరు. ఎన్ని కోట్లు ఇచ్చిన తన హద్దుదాటి నటించేందుకు ఇష్టపడదు సాయిపల్లవి. అందుకే చేసింది తక్కువ సినిమాలే అయిన అద్భుతమైన నటన, డ్యాన్స్ తో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ టాలెంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ అమ్మడు అందరి హీరోయిన్స్ లా కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పదు. కథలో తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉండి.. నచ్చితే తప్ప చేయదనే టాక్ ఇప్పటికి ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయాణం మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షూటింగ్ సమయంలో పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది.
” పీరియడ్స్ టైం లో షూటింగ్ అంటే కష్టమే పైగా డ్యాన్స్ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. కొన్ని సినిమాల్లో పీరియడ్స్ సమయంలోనే నేను డ్యాన్స్ చేశాను. కొన్నిసార్లు ఆ సమస్యలను కూడా పక్కన పెట్టి పని చేయాలి. ఆ సమయంలో మనకు వేరే ఆప్షన్ ఉండదు. శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా నెలసరి సమయంలోనే డ్యాన్స్ చేశా.. ఆ టైం లో నాకు పిరియడ్స్ కారణంగా విపరీతమైన కడుపు నొప్పి.. అయినా ఆ సాంగ్ పూర్తి చేశానని” సాయి పల్లవి తెలిపింది.