సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. సాయి పల్లవి వయసు 30 ఏళ్లు. ఇండస్ట్రీకి 12 ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వచ్చిన ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసింది. అయితే సాయి పల్లవి ఈ 12 ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించింది.. ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తుందన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఈ అమ్మడు దూసుకెళ్తోంది. ఇటీవలే సాయి పల్లవి రాణాతో కలిసి విరాట పర్వంలో కనిపించింది. నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్ లవ్ స్టోరీతో సాయి పల్లవి అలరించింది. విరాట పర్వంలో సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో వచ్చిన కస్తూరి మాన్ అనే తమిళ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలో నటించింది. ఆ తర్వాత 2015లో వచ్చిన ప్రేమమ్ అనే మళయాళం సినిమాతో సాయి పల్లవికి మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల మేర పారితోషికం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులు ఎంత ఉంటాయి అనే విషయంపై వార్తలు వస్తుండగా 2020లో సాయి పల్లవి 3 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించారని సమాచారం.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.26 కోట్ల మేర ఆమె కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 30 ఏళ్లు.. 12 ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో అందరినీ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.