Sai pallavi : మలయాళ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘ప్రేమమ్’..ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న కేరళ, తమిళనాడులోని థియేటర్ల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా రెండు చోట్లా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. తమిళం, మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ సినిమాల్లో ప్రేమమ్ ఒకటి.
ప్రస్తుతం రీ-రిలీజ్ అయిన సినిమాలు రెండు మూడు రోజులు థియేటర్లలో ఆడడం కష్టం. కానీ ప్రేమమ్ సినిమా విడుదలై ఐదు రోజులైనా చెన్నైలోని చాలా థియేటర్లలో ఆడుతుండటం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉందని ఆ సినిమాలో నటించిన మరొక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద సినిమాలు థియేటర్లలో లేకపోవడం ప్రేమమ్ రీ రిలీజ్ కు ప్లస్ పాయింట్. అయితే ప్రేమమ్ సినిమాని థియేటర్లలో రీరిలీజ్ చేయడం ఇది మూడోసారి.

2016లో ప్రేమికుల రోజున తమిళంలో రీ-రిలీజ్ అయిన ఈ సినిమా.. 2017లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ల తర్వాత మూడోసారి రీరిలీజ్ రూపంలో ప్రేమమ్ థియేటర్లలో విడుదలైంది. మూడు సార్లు రిలీజ్ అయినా ప్రేమమ్ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రేమమ్ చిత్రానికి అల్ఫోన్సో పుత్రేన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో కొత్త నటీనటులతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా టోటల్ గా రూ.75 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ మలయాళ చిత్రం తమిళనాడులోని చాలా థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ప్రేమమ్ సినిమాతో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేమమ్ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌లో నాగ చైతన్య హీరోగా నటించాడు. చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో మాతృకలో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు తెలుగు రీమేక్‌లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తెలుగులో సాయి పల్లవి పాత్రను శృతి హాసన్ పోషించింది. ప్రేమమ్ చిత్రం తెలుగులో కూడా కమర్షియల్‌గా విజయం సాధించింది.