Sai Pallavi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది సౌత్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి. తెలంగాణ యాసలో తన కట్టుబొట్టుతో అచ్చ తెలుగమ్మాయిలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ క్యూటీ తొలి సినిమాతోనే కోట్లాది మంది అభిమాన హీరోయిన్ గా మారిపోయింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు తెలుగులో తన మొదటి సినిమాకే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఏడాదికి ఐదారు సినిమాల్లో నటించేంత ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ. 2023లో ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. గత ఏడాది విరాట పర్వం సినిమాలో రానా సరసన నటించిన ఈ క్యూటీ ఏడాది పాటు ఏ సినిమాను ఓకే చేయలేదు. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

ఈ క్రమంలోనే సాయిపల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరమైందని, సినిమాల్లో నటించడం మానేస్తుందని పలు వార్తలు వైరల్‌గా మారాయి. ఈ వార్తలకు తగ్గట్లుగానే సాయి పల్లవి కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలకు కూడా నో చెబుతూ వచ్చింది. ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ట్రెడిషనల్ బ్యూటీ. కొన్ని సినిమాల షూటింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. తమిళంలో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో కూడా నటిస్తోంది. మలయాళంలో నవీన్ ఫౌలీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ.. ఈ సినిమాలో నవీన్ పౌలితో కలిసి నటించింది. ఆ తర్వాత మరో సారి ఆమె అతనితో జతకట్టనుంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యష్19 సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోందనే వార్త వైరల్ అవుతోంది. మొత్తానికి సాయి పల్లవి వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. సాయి పల్లవి ఫ్యాన్స్ అంతా తాము కోరుకున్నది జరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
