Sai Pallavi : రణ్ బీర్ కపూర్.. ‘రామాయణ’ ప్రాజెక్ట్ లో రాముడిగా చేస్తున్నట్లు తెలిసిందే. ఇక సాయి పల్లవి సీత క్యారెక్టర్ ప్లే చేస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ నితీశ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ కాగా.. ఇప్పటికే ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఇక రణ్ బీర్ కపూర్ కూడా సినిమా కోసం వర్కౌట్స్ మొదలుపెట్టారు. దానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఒక వార్త తెగ హల్ చల్ చేస్తోంది అదే.. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి రెమ్యునరేషన్ గురించి.

మరి అవి ఎంత మాత్రం నిజమో. ‘రామాయణ’ ప్రాజెక్ట్ లో రాముడి పాత్రలో నటించేందుకు రణ్ బీర్ కపూర్ రూ.75 కోట్లు రెమ్యునరేషన్ అడిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘యానిమల్’ సినిమా టైంలో రణ్ బీర్ కపూర్ రెమ్యునరేషన్ రూ.70 కోట్లు అని, యానిమల్ సినిమాకు మాత్రం ఆయన కేవలం రూ.30 నుంచి రూ.35 కోట్లు మాత్రమే ఛార్జ్ చేశారనే వార్తలు వచ్చాయి నేషనల్ మీడియాలో. అలాంటిది ఆ సినిమా హిట్ తర్వాత ఆయన మళ్లీ పాత రెమ్యునరేషన్ కంటే రూ.5కోట్లు ఎక్కువగానే తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీత క్యారెక్టర్ లో నటిస్తున్న సాయి పల్లవి మాత్రం రణ్ బీర్ కపూర్ కంటే ఆరు రెట్లు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
సాయి పల్లవి రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయిపల్లవి రణ్ బీర్ కపూర్ కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ.. ఆమె ఈ సినిమాకి తన రెమ్యునరేషన్ డబుల్ చేశారనే టాక్ ఫిలిమ్ నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. ఒక్కో సినిమాకి గతంలో రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం దాన్ని డబుల్ చేశారట సాయి పల్లవి. మరి ఈ వార్తలపై రణ్ బీర్, సాయిపల్లవి ఎలా స్పిందిస్తారో వేచిచూడాలి మరి.