ఈ సమ్మర్ లో పెట్టిన ప్రతీ పైసాకి 10 రూపాయిల లాభాన్ని తెచ్చిపెట్టిన చిత్రం సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన హారర్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. విడుదలకు ముందు నుండే ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ తో ఎదో సరికొత్త సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు అనే సంకేతం అందించడం లో సఫలం అయ్యింది మూవీ టీం. అయితే ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఈ చిత్రం ఎంతో సరికొత్తగా ఉంటూ కమర్షియల్ గా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది.
తెలుగు లో భారీ బ్లాక్ బస్టర్ అయ్యేలోపు ఇతర బాషలలో కూడా విడుదల చేసారు కానీ,ఆయా భాషల్లో సక్సెస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. రీసెంట్ గానే ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రన్ ని క్లోజ్ చేసుకుంది.22 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగం లోకి దిగిన ఈ చిత్రం, క్లోసింగ్ కి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రం క్లోసింగ్ లో 48 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది, అంటే జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి రెండింతల కంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టింది అన్నమాట. ఈ సమ్మర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకోలేదు. కానీ ‘విరూపాక్ష’ చిత్రం చిన్న సెంటర్ నుండి పెద్ద సెంటర్ వరకు ప్రతీ బయ్యర్ కి పండగ చేసుకునే రేంజ్ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం కి వచ్చిన లాభాలతో నిర్మాత మరో ‘విరూపాక్ష‘ లాంటి రెండు సినిమాలు తియ్యొచ్చు అని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొత్తానికి బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కి కెరీర్ పరంగా కావాల్సిన బ్రేక్ అయితే దక్కింది, దీనిని ఆయన ముందుకు కొనసాగిస్తాడో లేదో చూడాలి.