Virupaksha First Review : బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మొట్టమొదటి చిత్రం ‘విరూపాక్ష’.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ మరియు స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి కార్తీక్ దండు అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో ఈ నెల 21 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ తో సాయి ధరమ్ తేజ్ మన ముందుకు రాబోతున్నాడు అనే విషయం అయితే టీజర్ మరియు ట్రైలర్ ని చూసి అర్థం చేసుకోవచ్చు.కానీ ఈ సినిమాకి ఉన్న మైనస్ ఏమిటంటే ఒక్క పాట కూడా హిట్ కాకపోవడమే.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో మీడియం హీరో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ జరగాలంటే కచ్చితంగా పాటలు బాగుండాలి, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో జరగదు.

ఇప్పుడు ‘విరూపాక్ష‘ విషయం లో కూడా జరుగుతున్నది అదే, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు, ఇకపోతే ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు ‘A’ సర్టిఫికేట్ ని ఇచ్చారు. హారర్ థ్రిల్లర్ కాబట్టి, కొన్ని భయంకరమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టే A సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రివ్యూ షో ని నిన్ననే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది బయ్యర్స్ కి వేసి చూపించారు మేకర్స్. వాళ్ళ నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే హారర్ సన్నివేశాలు మైండ్ అయ్యేలా చేసిందని, ఈమధ్య ఇలాంటి థ్రిల్లర్ ని చూసి చాలా కాలం అయ్యిందని, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, ఇతర బాషలలో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది అనే నమ్మకం ఉందని ఈ ప్రివ్యూ షో ని చూసిన వారు చెప్పారట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ కామన్ ఆడియన్స్ నుండి కూడా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.