Sai Dharam Tej : ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలలో కూడా చాలామంది క్రికెట్ లవర్స్ ఉన్నారు. అలాంటి వారిలో సాయి ధరంతేజ్, అఖిల్ వంటి హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు మరీ ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ గురించి చెప్పుకోవాలి. మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మంచి పేరు సంపాదించుకున్నారు. కెరియర్ ఆరంభంలో వరుసగా సూపర్ హిట్ అందుకున్న ఈయన ఆ తర్వాత ఆరు డిజాస్టర్ లను ఎదుర్కొని రేస్ లో వెనుకబడ్డాడు. మళ్ళీ చిత్రలహరి చిత్రం నుండి స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నారు.

అనుకున్నంత స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా సమయంలో బైక్ యాక్సిడెంట్ అయింది.. అభిమానుల దీవెనలతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తాజాగా నటించిన విరూపాక్ష చిత్రం ఈనెల 21వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు పరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు.

ఈ క్రమంలోని ఒక ఇంటర్వ్యూలో సాయి ధరం తేజ్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎన్నో మెడల్స్ కూడా సాధించాను. నేషనల్ క్రికెట్ టీం లో కూడా సెలెక్ట్ అయ్యాను.. కానీ సినిమాల మీద మక్కువ కారణంగా వెళ్లలేకపోయాను.. అంటూ సాయి ధరంతేజ్ కామెంట్లు చేశాడు. ఇది విన్న తర్వాత ఇతనిలో ఇంత టాలెంట్ ఉందని ఆశ్చర్య పోతుంటే… మరికొంతమంది సొల్లు చెప్పకు అంటూ నెగిటివ్గా కామెంట్లు చేస్తున్నారు.