మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంత సరదాగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. ఎప్పుడు జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంటాడు. అలాంటి ఆయనకీ బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసారు. చివరికి ఆయన సురక్షితంగా ప్రాణకాలతో బయటపడి, ఇప్పుడు తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. తాజాగా విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరోకు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది.
హీరో అన్న తర్వాత అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏం చెప్పినా ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తుంది. అదే తరహాలో సాయి ధరమ్ తేజ్ తన రియల్ లైఫ్ లోని ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన క్రష్ గురించి, తాను ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ విషయం తెలిసినప్పటి నుంచి సాయి ధరమ్ తేజ్ లవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపించి జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇక గతంలో సాయిధరమ్ తేజ్ ఆ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు రెజీనా కసాండ్రా. రెజీనా సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.