చాలా మందికి కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పక్షులు పెంచుకుంటారు. వాటితో చక్కటి అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు. ఒక్కోసారి వాటికి ఏమైనా ఇబ్బంది కలిగితే అస్సలు తట్టుకోలేరు. కొన్నిసార్లు అవి చనిపోతే కంటతడి పెడతారు. తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన కంటతడి పెట్టారు. దానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

“టాంగో, నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు చాలా తేలికగా, హ్యాపీగా ఉంటుంది. నువ్వు లేవు అనే విషయాన్ని తట్టుకోలేక పోతున్నాను. నువ్వు లేవనే విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాను. నన్ను నువ్వు ఎన్నోసార్లు కాపాడావు. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు ఇచ్చావు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నవ్వించావు. నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్నావు. నువ్వు నాతో ఉన్న క్షణాలన్నీ ఎంతో అమూల్యమైనవి. నాకు నీ నుంచి ఎంతో ప్రేమ లభించింది. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నా దగ్గరికి వచ్చిన తొలి రోజు ఇప్పటికి వరకు ఎన్నో జ్ఞాపకాలు నీతో ఉన్నాయి. లవ్ యు మై బండ ఫెలో, టాంగో” అంటూ ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

సాయి ధరమ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. డార్క్ ఫ్యాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొట్టింది. సాయి తేజ్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లను వసూలు చేసి వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.