పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు 90 శాతం కి పైగా పూర్తి చేసుకొని విడుదల కి సిద్ధం గా ఉన్న చిత్రం ‘బ్రో’. జులై 26 వ తారీఖున ఈ చిత్రం విడుదల కాబోతుందని ఇది వరకే దర్శక నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే చిత్రం స్టోరీ లైన్ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తుంటే, సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు అనే పాత్రలో కనిపిస్తున్నాడు. కాసేపటి క్రితమే ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం, కొద్దీ రోజుల క్రియేటమే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ కి ఇండియాలో ఇప్పటి వరకు విడుదలైన మోషన్ పోస్టర్స్ అన్నిటికంటే మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది.

అయితే పవన్ కళ్యాణ్ మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ వచ్చినప్పటికీ మోషన్ పోస్టర్ వీడియో క్లారిటీ సరిగా లేదని ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ వచ్చింది.కానీ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ మరియు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అంటూ ప్రశంసల వర్షం కురిసింది.అయితే ఈరోజు విడుదలైన సాయి ధరమ్ తేజ్ మోషన్ పోస్టర్ క్వాలిటీ బాగుందని, పవన్ కళ్యాణ్ పోస్టర్ కంటే కూడా ఈ పోస్టర్ బాగా నచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ లో ఫేస్ సరిగా కనపడలేదని ఫ్యాన్స్ కాస్త నిరాశకి గురయ్యారు. క్వాలిటీ అలా కాకుండా, నాసిరకపు క్వాలిటీ ని పక్కన పెట్టి సరికొత్త క్వాలిటీ తో ఈ ఈసారి విడుదల అయ్యే పోస్టర్ ఉండాలని అంటున్నారు ట్రేడ్ పండితులు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న పోస్టర్ ని కూడా విడుదల చేయబోతున్నారట.
