నెక్స్ట్ మూవీకి “దళపతి విజయ్” 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?

- Advertisement -

తమిళ స్టార్ హీరో దళపతి ” విజయ్ ” కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు విజయ్. ఇక ఇటీవలే మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్ లో “వారసుడు” సినిమా చేశాడు. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ విజయ్ ని తెలుగు ప్రజలకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది.

దళపతి విజయ్
దళపతి విజయ్

అయితే విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేస్తుంది. తమిళ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చక చకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. సంజయ్ దత్, గౌతమ్ మీనన్.. పలువురు ప్రముఖులు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే విజయ్ మరో కొత్త మూవీని ఈరోజే ( మే 21, 2023 ) అనౌన్స్ చేశాడు.

విజయ్
విజయ్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా రానుంది. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. విజయ్ లియో సినిమా షూట్ పూర్తయ్యాక ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. 2024 సమ్మర్ కి ఈ సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

కాగా ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్‌కు రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. ఇక ఇదే వార్త నిజమైతే సౌత్‌ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా విజయ్ నిలవనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా లాభాల్లోనూ విజయ్‌కు మేజర్ షేర్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇక ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here