Rukshar Dhillon: రుక్సార్ ధిల్లాన్ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో పట్టా సాధించి.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీపై ఆసక్తిని పెంచుకుని.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. లండన్‌లో పుట్టిన ఈ పంజాబీ భామ 2016లో కన్నడ ఇండస్ట్రీ ద్వారా ‘రన్ అంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనంతరం 2017లో ‘ఆకతాయి’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. ఇక 2018లో నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’తో రుక్సార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
విశ్వక్సేన్తో అశోకవనంలో అర్జున కల్యాణం, అల్లు శిరీష్ సరసన ఏబీసీడీ వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో తన నటనకు మంచి మార్కులందుకుంది. ఇటీవల ‘స్పార్క్’ సినిమాలో నటించింది. అందం, గ్లామర్‌తో ఆకట్టుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఇతర భాషల్లో ఆఫర్స్ అందుకుంటూ అక్కడ తన లక్ పరీక్షించుకుంది. అయితే మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును తన మాయలో పడేసుకుంటుంది.
ఇక ఈ భామ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే గ్లామర్ ఫోటోలని షేర్ చేసింది. తన కోట్ విప్పేసి స్పోర్ట్ బ్రాలో దర్శనం ఇచ్చింది. ఎద అందాలు కనిపించేలా ఫోజులు ఇస్తూ ఫోటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కుర్రకారు తన అందాలకు ఫిదా అవుతున్నారు.