Rohit Sharma : ఇండియన్ టీం ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఆయన సాధించిన కీర్తి ప్రతిష్టలు, అందుకున్న విజయాలు, చూసిన శిఖరాలు అన్నీ ఇన్ని కావు. మన దేశ ప్రతిష్టకి ఒక విలువైన సంపద అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపక్క ఇండియన్ టీం కి ప్రాతినిధ్యం వహిస్తూనే మరోపక్క ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం కి ప్రాతినిధ్యం వహించి 5 సార్లు ట్రోఫీ ని కొల్లగొట్టాడు.

ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి, ఇండియన్ క్రికెట్ టీం లో స్థానం సంపాదించిన రోహిత్ శర్మ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాడు. ఒకానొక దశలో ఆయనకీ టీం చోటు దక్కని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి స్థానం నుండి నేడు ఆయన వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్స్ లో ఒకరిగా నిలబడడం అనేది సాధారణమైన విషయం కాదు.

ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ కి విశాల్ శర్మ అనే సోదరుడు ఉన్నాడు. ఇతను కూడా చూసేందుకు అచ్చు గుద్దినట్టుగా రోహిత్ శర్మ లాగానే ఉంటాడు. ఈయన తన అన్నయ్య లాగ పెద్ద క్రికెటర్ అవ్వాలని కోరుకోవడం లేదు కానీ, సినిమాల్లో పెద్ద స్టార్ అవ్వాలని మాత్రం అనుకుంటున్నాడట. త్వరలోనే బాలీవుడ్ లో ఆయన హీరో గా వెండితెర అరంగేట్రం చెయ్యడానికి ముహూర్తం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు అని టాక్. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు, ఏమిటి అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియచేస్తారట. చూడాలి మరి విశాల్ శర్మ అనుకున్న లక్ష్యం కి చేరుకుంటాడా లేదా అనేది.