మందేస్తూ, అమ్మాయితో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన ఆర్జీవీ.. ఫోటో వైరల్..

- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాల మాట పక్కన పెడితే ఆయన పొలిటికల్ లీడర్స్ పై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు.. వైసీపీ ని సపోర్ట్ చేస్తూ టీడీపీ పై ఫైర్ అవుతూ వరుసగా ట్వీట్స్ చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అందరి కోపానికి కారణం అవుతుంటాడు.. ఈ మధ్య సినిమాలు ఏమి చెయ్యలేదు అని తెలిసిందే.. ఇక కొన్నాళ్లుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను ట్రోల్ చేస్తున్నారు. వారి వ్యక్తిత్వం దెబ్బతీసేలా సినిమాలు కూడా చేశాడు. ఇక తాజాగా మరో ట్వీట్ చేశారు..

ఆర్జీవీ
ఆర్జీవీ

రిప్ జనసేన అంటూ ట్వీట్ చేశారు అది ఇప్పుడు వైరల్ అవుతుంది..ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన మీద పలుమార్లు దాడులకు తెగబడ్డారు. పవన్, చంద్రబాబులను వ్యతిరేకించే రామ్ గోపాల్ వర్మ జగన్ ను ఎవరైనా ఒక్క మాట అంటే మాత్రం అస్సలు ఊరుకోడు.. ఏపీ పాలిటిక్స్ మీద రామ్ గోపాల్ వర్మ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.

RGV pawan Kalyan

గత గత రెండు రోజులుగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ చేస్తున్న పొలిటికల్ స్టేట్మెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన సీఎం రేసులో లేను. వైసీపీని గద్దె దించేందుకు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇతర ప్రధాన పార్టీలతో పొత్తుకు సిద్ధం అన్నారు.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు..

- Advertisement -

ఇది ఇలా ఉండగా పవన్ కాపులను వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం మాత్రమే కాదు.. జనసేన అభిమానులకు వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి… అంటూ ఓ సెటైరికల్ ట్వీట్ వేశాడు. మరొక ట్వీట్ Rip జనసేన. బాధలో మేమిద్దరం పార్టీ చేసుకుంటున్నామని ఓ ఫోటో పోస్ట్ చేశారు. పబ్ లో ఫుల్ గా మందేస్తూ అమ్మాయితో దమ్ముకొడుతున్న ఆ ఫోటో వైరల్ అవుతుంది.. ఇక ఇప్పటికే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఎలాంటి వివాదాలను తెస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here