టాలివుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ జోడీలలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి జంట కూడా ఒకటి.. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలామంది జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరూ ప్రేమించి ఎంత కష్టమైనా సరే ఇంట్లో వాళ్ళను ఒప్పించి చాలా ఏళ్ల తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.. కాగా, స్నేహా రెడ్డి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

అదేంటంటే.. అల్లు అర్జున్ అమ్మకి స్నేహ రెడ్డిని ఇంటి కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదా అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే స్నేహ రెడ్డి కంటే ముందే అల్లు అర్జున్ కి తన తల్లి తన బంధువుల్లో ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేయాలని చూసిందట.. కానీ బన్నీ అప్పటికే స్నేహ రెడ్డిని ఒక ఫ్రెండ్ పెళ్లిలో చూసి ఇష్టపడి ఇంట్లో వాళ్ళకి చెప్పారు. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ తల్లి తన సమీప బంధువుల అమ్మాయి ఉంది అని చెప్పడంతో అల్లు అర్జున్ నేను చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా లేకపోతే లేదు అని గట్టిగా చెప్పారట.. దాంతో తల్లి తన ఆలోచనను మానుకుందట..

ఇక స్నేహారెడ్డిని తన ఇంటి కోడలు చేసుకోవడానికి స్వయంగా తానే వెళ్లి అడిగిందని కూడా సమాచారం.. అయితే మొదట్లో స్నేహ రెడ్డిని ఇంటికోడలుగా చేసుకోవడం అల్లు అర్జున్ తల్లికి ఇష్టం లేదట. కానీ ఇంటికి కోడలుగా వచ్చాక స్నేహ రెడ్డి మంచితనం చూసి నా కోడలు చాలా మంచిది అని అనుకుందట.. అలా మొదట్లో ఇష్టపడని ఆమె ఇప్పుడు కోడలు అంటే ప్రాణమిస్తుందని టాక్.. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు..ఇప్పుడు పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు..