‘ఢీ’ షో లో కొరియోగ్రాఫర్ గా తన కంటెస్టెంట్స్ దగ్గర నుండి ఎంత మంచి డ్యాన్స్ ని రాబట్టి అనతి కాలం లోనే మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న చైతన్య మాస్టర్, నిన్న నెల్లూరు లోని లయన్స్ క్లబ్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చనిపోయే ముందు ఆయన ఒక వీడియో ని విడుదల చేస్తూ, అప్పుల బాధ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా చెప్పుకొచ్చాడు.
చైతన్య మాస్టర్ లాంటి సెలబ్రిటీ కి అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా, ఇదెక్కడి ఖర్మ రా బాబు అని ఆయనని అభిమానించే వాళ్ళు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. అయితే ఎంత పెద్ద సెలెబ్రిటీలు అయినా వాళ్ళు కూడా కేవలం మనుషులు మాత్రమే, వాళ్లకి ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ చైతన్య మాస్టర్ చనిపోవడానికి కారణం మాత్రం ఈవెంట్స్ చేయించుకొని ఆర్గనైజర్లు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్లే అట.
పాపులర్ డ్యాన్స్ కండక్టర్ ఝాన్సీ చైతన్య మాస్టర్ చనిపోవడానికి గల కారణం చెప్తూ ‘ ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా చైతన్య మాస్టర్ ని ఒక ఈవెంట్ నిర్వహించాల్సిందిగా ఒక ప్రముఖ కంపెనీ కి చెందిన ఆర్గనైజర్లు అడిగారు, అంతే కాదు ఆయనతో పాటుగా కొంతమంది పాపులర్ ఆర్టిస్టులను కూడా తీసుకొస్తానని మాట ఇచ్చాడు. అయితే వాళ్ళు ఈవెంట్ జరిగే చివరి నిమిషం లో హ్యాన్డ్ ఇచ్చారు, దీనితో ఆర్గనైజర్లు ఆ పాపులర్ సెలెబ్రిటీల పేర్లు చెప్పే టికెట్స్ అన్నీ సేల్ చేశామని, ఇప్పుడు వాళ్ళు రాకపోవడం వల్ల మాకు చాలా నష్టం వచ్చిందని చైతన్య కి చెప్పారు’.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘అంతే కాదు ఆయనకీ ఇవ్వాల్సిన ఆరు లక్షల రూపాయిల చెక్ ని కూడా ఆపేశారని, అందువల్ల ఆయన మిగతా వాళ్లకి పేమెంట్ ఇవ్వాలి కాబట్టి ,అప్పు చెయ్యాల్సి వచ్చిందని, ఆ అప్పు తీర్చడం కోసం కొత్త అప్పులు చెయ్యడం, అలా అప్పు మీద అప్పు చేస్తూ చివరికి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు’ అంటూ ఝాన్సీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.