Prabhas : కొన్నాళ్ళుగా బయట ఎలాంటి ఈవెంట్స్ లో కనిపించని డార్లింగ్ కనీసం ఎలక్షన్ డే అయినా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయటకు వస్తారని ఆశించిన అభిమానులకు చివరికి నిరాశే ఎదురైంది. ప్రభాస్ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూత్ మణికొండలో ఉంది. దాంతో కొందరు డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన కోసం పోలింగ్ కేంద్రం వద్ద ఎదురు చూశారు. కానీ ప్రభాస్ మాత్రం ఓటు వేయడానికి రాలేదు.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ పనులు అన్నిటిని మానుకొని మరి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. రామ్ చరణ్ అయితే మైసూర్ లో షూటింగ్ మానేసుకుని మరి వచ్చాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఎందుకు తన ఓటు హక్కు వినియోగించుకోలేదనేది అభిమానుల ప్రశ్న. మోకాలి సర్జరీ జరగడం వల్ల ప్రభాస్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, అందుకే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభాస్ రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ ఒక్కడే కాదు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఓటు వేయలేదని తెలుస్తోంది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ‘కన్నప్ప’ షూటింగ్ లో ఫారిన్ లో ఉండడంతో వాళ్లు కూడా ఓటు వేయలేదని తెలుస్తోంది.
ఎలక్షన్ రోజు హైదరాబాదులోనే ఉన్నా అఖిల్ అక్కినేని, అల్లరి నరేష్, శర్వానంద్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు పోలింగ్ సెంటర్ల వద్ద కనిపించకపోవడం గమనార్హం. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నమ్రత, విజయ్ దేవరకొండ, నితిన్, విక్టరీ వెంకటేష్, రాజమౌళి, నాగార్జున, నాగచైతన్య, రవితేజ, కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, నాని, విశ్వక్ సేన్, నిఖిల్ తమ ఓటు హక్కును హైదరాబాద్ జూబ్లీహిల్స్ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ సెంటర్స్ లో వినియోగించుకున్నారు.