Telugu Actress : తెలుగమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఎందుకు రావు.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా..

- Advertisement -

Telugu Actress తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ గా అవకాశాలు తక్కువ.. ఈ మాట ఇప్పటిది కాదు.. చాలా ఏళ్లుగా ఉంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఈ విషయంపై కామెంట్స్ చేయడంతో మరోసారి చర్చ మెుదలైంది. అప్పుడప్పుడూ కలర్స్ స్వాతి, బిందు మాధవి, ఈషా రెబ్బా, అంజలి లాంటి హీరోయిన్లు వచ్చినా.. టాలీవుడ్ కంటే పక్క భాషల్లోనే ఎక్కువగా అవకాశాలు అందుకున్నారు.. సక్సెస్ అయ్యారే తప్ప మన దగ్గర మాత్రం వాళ్లకు క్రేజ్ రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిల టైమ్ మొదలైందా..? ఇన్నేళ్లూ పక్క ఇండస్ట్రీ నుంచి.. పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న దర్శక నిర్మాతలకు ఇప్పుడా కరువు తీరిపోయినట్లేనా..? ధమాకా, బేబీ లాంటి సినిమాలు మన అమ్మాయిల సత్తా చూపించాయి. మరి ఈ సక్సెస్ తెలుగమ్మాయిల జాతకాన్ని మార్చేస్తుందా..? ఇప్పటికైనా బయటికొస్తారా.. వాళ్లకు మన మేకర్స్ ఛాన్సులిస్తారా..?

Telugu Actress
Telugu Actress

ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్నడ, ముంబయి అమ్మాయిలే హీరోయిన్లుగా రాణిస్తున్నార‌ని, కానీ తెలుగు అమ్మాయిలు మాత్రం అవ‌కాశాలు ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని అల్లు అర్జున్‌ అన్నాడు. బేబీ మూవీ బ్లాక్ బస్టర్ సెల‌బ్రేష‌న్స్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. సినీ ప‌రిశ్రమలో తెలుగు అమ్మాయిల రిప్రంజటేషన్ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని బేబీ మూవీ వేడుక‌లో పేర్కొన్నాడు. తెలుగు అమ్మాయి అయిన శ్రీలీల మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణిస్తుందని, ఇప్పుడు వైష్ణవి కూడా లిస్టులో చేరిపోయిందని చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్ మాటలను అంత తేలికగా తీసుకోడానికి లేదు. ఎందుకంటే.. ఈ విషయంపై చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో వివాదం నడుస్తూనే ఉంది. అవకాశాలు రాని వాళ్లు.. తెలుగు అమ్మాయిలం కాబట్టి ఛాన్స్ లేదని చెబుతారు. సినిమా దర్శకులేమో.. వాళ్లే రావడం లేదని అంటుంటారు. నిజానికి మెుదట ప్రతీ ఇంట్లో సినిమా అంటే ఓ అపోహ ఉంటుంది. అమ్మో సినిమా వాళ్లు అనే మైండ్ సెట్ తో ఉంటారు. ఇప్పుడిప్పుడంటే.. కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు గానీ.. ఒకప్పుడు సినిమాల్లోకి వెళ్లాలంటే వంద రకాలుగా ఆలోచించేవారు. ఇక హీరోయిన్ అవ్వాలని ఇంట్లో అంటే.. అస్సలు ఒప్పుకొనేవారు కాదు. సినిమా గురించి బయట జరిగే ప్రచారం కూడా ఇందుకు కారణం అయి ఉండొచ్చు.

- Advertisement -

అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన నిలదొక్కుకున్నవారూ ఉన్నారు. అయితే ఇప్పడు మాత్రం పరిస్థితులు మారుతున్నాయి. కానీ ఇప్పటికే హీరోయిన్ గా సినిమాలు చేసిన కొంతమంది తెలుగు హీరోయిన్లకు మరిన్ని ఛాన్సులు లేవనేది కొందరి ప్రశ్న. శోభిత దూళిపాళ్ల, ఈషా రెబ్బ, ప్రియాంక జవాల్కర్, అనన్య నాగళ్ల లాంటి హీరోయిన్లు తమ నటన, అందంతో ఆకట్టుకున్నారు. ఎక్స్ పోజింగ్ కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ తో తెలుగు అమ్మాయిలు ముందుకు వస్తారో లేదో చూడాలి. అలాగే దర్శకులు కూడా.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇస్తారో లేదో వెయిట్ చేయాలి. బేబీ మూవీతో ఇలాంటి చర్చకు తెరలేపిన వైష్ణవి చైతన్యకు మరిని అవకాశాలు రావాలని కోరుకుందాం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here