నాగ చైతన్య, సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు.

తెర మీద సామ్, చై జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సినిమాతో పాటు బయటకు కూడా ఈ జంట అందరికీ తెగ నచ్చింది. సినిమా సెట్ నుంచే వీరి స్నేహం మొదలయ్యింది. నెమ్మదిగా ప్రేమగా మారింది. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే, వీడి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం పట్ల చాలా మంది సినీ అభిమానులు బాధపడ్డారు.

తాజాగా వీళ్లు విడిపోవడం పై ఒక విషయం నెట్టింట వైరలవుతోంది. నాగచైతన్య సమంత ఇద్దరూ ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్లారట. ఆ పార్టీలో సమంత కాస్త డ్రింక్ చేసిందట. అయితే ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ తలెత్తిందట. అయితే ఆ గొడవ జరిగాక సమంత ఆ గొడవ విషయంలో పంతానికి పోయిందట. అంతేకాదు సమంతకి ఉన్న అహంకారం వల్ల ఆ గొడవలు నాగార్జున వరకు తీసుకువెళ్లిందట. అయితే నాగార్జున సమంతతో ఎంత వారించినా కూడా ఫలితం లేకుండా పోయిందట.