Jamuna : తన ఆస్తి మొత్తాన్ని కొడుక్కి దక్కకుండా చేసిన జమున.. కారణం అదేనా?

- Advertisement -

Jamuna : ఆరోజుల్లో మహానటి సావిత్రి తో సరిసమానమైన ఇమేజి సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది జమున మాత్రమే..ఆరోజుల్లో ఈమె రెమ్యూనరేషన్ సీనియర్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఉండేదట..దీనిని బట్టి ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..అప్పట్లో ఏ స్టార్ హీరో సినిమాలోనైనా జమున ఉండాల్సిందే..అలా మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ టాప్ 2 హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది.

Jamuna
Jamuna

జమున తానూ సంపాదించిన డబ్బు మొత్తాన్ని చాలా చాలా జాగ్రత్తగా తెలివిగా ఖర్చు చేసేది..ఆరోజుల్లో మార్కెట్ లో ఏదైనా ఒక విలువైన వస్తువు వచ్చిందంటే అది కచ్చితంగా జమున ఇంట్లో ఉండాల్సిందే..అంతే కాదు ఆరోజుల్లోనే ఈమె చెన్నై మరియు హైదరాబాద్ వంటి ప్రాంతాలలో తానూ సంపాదించిన డబ్బుని రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టింది..తద్వారా తన ఆస్తులని బాగా పెంచుకుంది..ఈమె దగ్గరున్నంత ఆస్తులు చాలా మంది స్టార్ హీరోలకు మరియు రాజకీయ నాయకులకు కూడా లేదని అంటుంటారు కొంతమంది.

Actress Jamuna

జమున గారికి ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు..కొడుకు పేరు వంశి జూలూరి, మరియు కూతురు పేరు స్రవంతి రావు..కూతురు స్రవంతి పలు సినిమాల్లో మరియు టీవీ సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించింది..కొడుకు వంశి అమెరికా బాగా స్థిరపడిపోయాడు..అయితే జమున స్రవంతి రావు కొడుకు అంటే ఎంతో ఇష్టం.

- Advertisement -
Jamuna family

తాను చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం తన మనవడికి చెందాలి అంటూ వీలునామా రాసిందట.. మరో విశేషం ఏమిటంటే జమున తన కొడుకు పేరు మీద ఒక్క ఆస్తి కూడా రాయలేదట.. ఎందుకంటే అతను జీవితం లో బాగా స్థిరపడిపోయిన వ్యక్తి అట..అందుకే అతనికంటే జమున మనవడికే ఆస్తి తో ఎక్కువ అవసరం ఉండడం వల్ల ఇలా చేసింది అంటున్నారు.. ఈమధ్యనే ఆమె స్వర్గస్తులు అయిన విషయం అందరికీ తెలిసిందే.

Jamuna Daughter In Law
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here