సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే కొన్ని కొన్ని సార్లు టాలెంట్ అదృష్టం కలిసి వచ్చినప్పటికీ భారీ బ్యాక్ గ్రౌండ్ కూడా కావాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల నుండి పోటీని తట్టుకొని నిలబడాలి అంటే ఇక భారీ బ్యాక్ గ్రౌండ్ ఎంతో అవసరం. కానీ ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు హీరో ఉదయ్ కిరణ్. చిత్రం అనే సినిమా ద్వారా హీరోగా ప్రస్తానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాడు.
అయితే ఉదయ్ కిరణ్ ని గతంలో సీనియర్ నటి సుధ దత్తత తీసుకుంటాను అని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఉదయ్ కిరణ్ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.సీనియర్ నటి సుధ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ మీద కోపంతో నేను అతని పెళ్లికి కూడా వెళ్లలేదు. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటేనే నా లోపల ఏదో భయం అనిపించింది. ఉదయ్ కిరణ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతనికి భవిష్యత్తులో ఏదో ప్రమాదం పొంచి ఉందని నేను ముందే ఊహించాను అంటూ సీనియర్ నటి సుధ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇక ఇండస్ట్రీలో హవా నడిపించేది ఉదయ్ కిరణ్ అందరూ భావించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షక ఆదరణకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే వరుస ప్లాపులతో సతమతమైన ఉదయ్ కిరణ్ తన దగ్గర ఉన్నదంతా సినిమాల కోసమే ఖర్చు పెట్టి చివరికి మనస్థాపంతో తన ఫ్లాట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు ఉదయ్ కిరణ్ కెరియర్ను నాశనం చేశారు అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.