Razakar Movie Review : హైదరాబాద్ రాష్ట్రంలో భారతదేశంలో విలీనానికి ముందు ఏం జరిగింది?. రజాకార్ల నేరాలు ఎలా సాగాయి అనే కథాంశంతో తెరకెక్కిన రజాకార్ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. రజాకార్ చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. బాబిసింహ, అనసూయ, ఇంద్రజ, వేదిక కీలక పాత్రలు పోషించారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రజాకార్ సినిమాలో ప్రత్యేకంగా హీరోలు ఎవరూ ఉండరు.
ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఓ పాత్రను తెరపైకి తెచ్చి కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించాడు దర్శకుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో విశేష ప్రజాదరణ పొందిన వారి జీవితం, కొన్ని చారిత్రక ఘట్టాలను సినిమాలో చూపించారు. చరిత్రను వక్రీకరించకుండా అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. రజాకార్ల సినిమాలో చూపించే కథలన్నీ ఎక్కువగా తెలిసిన కథలే. అయితే ఎమోషన్స్, డ్రామాతో అందరూ కనెక్ట్ అయ్యేలా సీన్స్ రాసుకున్నాడు. షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ, రాజా రెడ్డి వంటి ఎందరో నాయకులను స్ఫూర్తిదాయకంగా తెరపైకి తెచ్చారు.
సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. రాజన్నగా బాబిసింహ, పోచమ్మగా అనసూయ, శాంతవ్వగా వేదిక, ఐలమ్మగా ఇంద్రజ నటించారు. ఈ సినిమాలో నటన పరంగా ఖాసిం రజ్వీగా రాజ్ అర్జున్ హైలెట్ గా నిలిచాడు. విలన్ క్యారెక్టర్‌లో అతని నటన, ఎక్స్‌ప్రెషన్స్ భయపెడుతున్నాయి. వల్లభాయ్ పటేల్ పాత్రలో రాజ్ సప్రూ ఆకట్టుకున్నాడు. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్‌తో పాటు పలువురు నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. సాంకేతికంగా, భీమ్ పాటలు మరియు BGM దర్శకుడు వ్రాసిన కథ యొక్క అనుభూతిని ఎలివేట్ చేయడానికి సహాయపడతాయి. 1947 మరియు 48 కాలాన్ని విజువల్స్ మరియు గ్రాఫిక్స్ ద్వారా సినిమాలో సహజంగా చూపించారు. తెలంగాణ విమోచనోద్యమ చరిత్రలో నిలిచిపోయిన ఎందరో పోరాటయోధులు, సంఘటనలకు మంచి దృశ్యరూపంగా రజాకార్ సినిమా నిలుస్తుంది. చరిత్ర తెలిసిన వారికే ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.