MR Bachchan : మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫ్లాప్స్, డిజాస్టర్స్ కొత్తేమి కాదు. కానీ కొన్ని చిత్రాలకు ఎంత చెత్త టాక్ వచ్చినా కూడా వీకెండ్ వరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తాయి. బయ్యర్స్ కి 50 శాతానికి పైగా రికవరీ అవుతాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం మొదటి రోజు నుండే ఘోరమైన వసూళ్లను రాబడుతూ ఉంటాయి. బయ్యర్స్ కి 70 శాతానికి పైగా నష్టాలను మిగిలిస్తూ ఉంటాయి. అలాంటి చిత్రాలలో ఒకటి రీసెంట్ గా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా మీద అతి నమ్మకంతో విడుదలకు ఒక రోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వేయించాడు.
ఈ షో నుండి వచ్చిన డిజాస్టర్ టాక్ ప్రభావం మరుసటి రోజు సినిమా మీద తీవ్రంగా పడింది. ఫలితంగా ఆరు కోట్ల రూపాయలకు పైగా షేర్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టాల్సిన ఈ సినిమా, 5 కోట్ల రూపాయిల షేర్ లోపే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న మరో విషయం ఏమిటంటే, ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘మురారి’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. ఈ సినిమాకి ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పెట్టారో మన అందరికీ తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా 5 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. అయితే ఈ సినిమా వసూళ్లను మిస్టర్ బచ్చన్ చిత్రం రెండవరోజు నుండి అందుకోలేకపోయింది అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండవ రోజు మురారి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల రూపాయిల గ్రాస్, కోటి రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది. కానీ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రానికి రెండవ రోజు కేవలం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
దీనిని బట్టీ ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.అంతే కాదు మురారి చిత్రం రీ రిలీజ్ ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రం మాత్రం ఫుల్ రన్ లో 15 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న రవితేజ ఈరోజు ఒక రీ రిలీజ్ సినిమా వసూళ్లను అందుకోలేకపోవడం అంటే ఆయన అభిమానులకు ఎంత అవమానమో అర్థం చేసుకోవచ్చు.