Ravi Teja : టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి నేడు స్టార్ గా ఎదిగిన హీరోల లిస్ట్ తీస్తే అందులో మాస్ మహారాజ రవితేజ కచ్చితంగా ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శం గా తీసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన రవితేజ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి , ఆ తర్వాత హీరో గా సినిమాలు చేస్తూ హిట్టు మీద హిట్టు కొడుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు.
కంటెంట్ లేని సినిమాని కూడా తన అద్భుతమైన ఎనర్జీ తో దానిని జనరంజకంగా చెయ్యడం లో రవితేజ ని మించినోడు ఈ జనరేషన్ లేడు. క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన రోజుల నుండి ఇప్పటి వరకు ఆయన సుమారుగా 50 కి పైగా సినిమాల్లో నటించాడు. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేసే అలవాటు ఉన్న రవితేజ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.
అదేమిటి అంటే రవితేజ ఇక కేవలం రెండు మూడు సంవత్సరాలు మాత్రమే సినిమాల్లో నటిస్తాడట. ఆ తర్వాత పూర్తిగా డైరెక్టర్ గా మారిపోబోతున్నాడని టాక్. గతం లో కూడా ఆయన ఈ విషయం పై అనేకసార్లు స్పందించాడు. దర్శకత్వం వహించాలని ఉంది కానీ, దర్శకత్వం వహించే సమయానికి నటించడం ఆపేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో త్వరలోనే ఆయన డైరెక్టర్ గా బిజీ అయ్యి నటనకు గుడ్ బై చెప్పబోతున్నాడని టాక్.
ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ నిజం అయితే మాత్రం రవితేజ ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే రవితేజ లో ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఎంత ఎనర్జీ అయితే ఉండేదో, అంత ఎనర్జీ ఇప్పటకికీ కూడా ఉంది. ఇంకో పదేళ్ల పాటు ఆయన నటించొచ్చు, కానీ ఇప్పుడు ఇలాంటి వార్త రావడం తో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.