ప్రస్తుతం హౌస్‍లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల తంతు జరగనుంది. ఈ వారం కూడా నామినేషన్లు హీట్‍గా జరిగినట్టు తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్‍తో చనువుగా ఉన్న విషయంపై గతంలో శివాజీ అన్న మాటను గుర్తు చేసుకొని ఆయనతో వాదనకు దిగింది రతిక. ‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు’ అని ఎందుకు అన్నారని శివాజీని రతిక ప్రశ్నించడంతో ప్రోమో మొదలైంది. దీంతో, బిగ్‍బాస్ వీడియోలు వేసి అంతా చూపిస్తారని శివాజీ కూల్‍గానే హెచ్చరించారు. సరదాగానే తాను అన్నానని చెప్పారు. అయినా రతిక వినకుండా వాదించారు.
దీంతో ‘నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావ్.. అంతేకదా’ అని శివాజీ సీరియస్ అయ్యారు. “నువ్వు హర్ట్ అయ్యావనే కదా నేను సారీ చెప్పింది. ఎందుకు సాగదీస్తున్నావ్. కాళ్లు పట్టుకోవాలా” అని రతికతో శివాజీ అన్నారు. అలా కాదు అని రతిక కవర్ చేసుకుంది. అయితే, కావాలనే మాట్లాడుతున్నట్టు తనకు అనిపిస్తోందని శివాజీ చెప్పారు. ఇలా ఇద్దరి మధ్య మాటల వార్ నడిచింది. నామినేషన్ల ప్రక్రియలో జ్యూరీ సభ్యులు అనే కొత్త కాన్సెప్టును ఈ సారి బిగ్‍బాస్ తీసుకొచ్చారు. ఎవరినైనా నామినేట్ చేయాలంటే జ్యూరీ సభ్యులను కూడా ఇంప్రెస్ చేయాలనే మెలిక పెట్టారు బిగ్‍బాస్.
జ్యూరీలో శివాజీ, సందీప్, శోభాశెట్టి ఉన్నారు. ప్రియాంక జైన్, టెస్టీ తేజను ప్రిన్స్ యావర్ నామినేట్ చేశారు. పవర్ అస్త్ర టాస్కును తనతో ఆడేందుకు ఇష్టపడలేదనే కారణంతో ప్రియాంకను నామినేట్ చేశారు యావర్. ఇద్దరు ఆడవాళ్లే ఆడాలని శోభాశెట్టితో ఫెమినిజం లాంటిది చూపారని యావర్ చెప్పారు. దీంతో జ్యూరీలో ఉన్న శోభ దీనికి అంగీకరించలేదు. కావాలనే తప్పుకున్నావని యావర్‌ను వారించారు.