అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో విడిపోయిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. దానికి కారణం లేకపోనూలేదు . అసలు ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. టాలీవుడ్ లో అడుగుపెట్టాక ఆమెకు కలిసొచ్చింది. వరుస హిట్స్ తో టాప్ హీరోయిన్ అయ్యారు. అదే స్థాయిలో ఆమె వివాదాల్లో ఇరుకున్నారు. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. ఈ చిత్ర హీరో రక్షిత్ శెట్టిని రష్మిక ప్రేమించారు. ఎంగేజ్మెంట్ జరిగాక అతనికి బ్రేకప్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసింది. రష్మిక మీద రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆమెను ట్రోల్ చేశారు.

ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండను కూడా వాడుకుని వదిలేసిందని అంటున్నారు. దానికి కారణం కూడా ఉందండోయ్ తాజాగా విజయ్ దేవరకొండ తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్ ప్రముఖులు అందరు విజయ్ దేవరకొండను.. ది విజయ్ దేవరకొండ అంటూ మెన్షన్ చేసి మరి విష్ చేశారు . అయితే రష్మిక మందన్నా ఆయనకు విష్ చేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన విజయ్ దేవరకొండ ఎంత జాన్ జిగిడి దోస్తులో మనకు తెలుసు. గీతగోవిందం సినిమా ద్వార మంచి ఫ్రెండ్స్ గా మారిన ఈ జంట..అప్పటి నుండి సోషల్ మీడియా లో ట్రెండింగ్ లోనే ఉన్నారు.

మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే. రష్మిక మందాన కనీసం సోషల్ మీడియాలో కూడా విషెష్ చెప్పలేదు. విజయ్ దేవరకొండ ఆమె బర్త్ డే పార్టీ గ్రాండ్ గా దగ్గరుండి నిర్వహించాడు. రష్మిక విజయ్ దేవరకొండకు ఎందుకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే చర్చ నడుస్తుంది. ఇద్దరికీ చెడిన పక్షంలో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారని, అందుకే రష్మిక విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదంటున్నారు. ఆ మధ్య విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పిన రష్మిక మరో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి దగ్గరయ్యారన్న వార్తలు వినిపించాయి. సాయి శ్రీనివాస్-రష్మిక ముంబైలో రెండు మూడు సందర్భాల్లో కలిసి కనిపించారు. దీంతో ఎఫైర్ వార్తలు గుప్పుమన్నాయి. ఈ కారణంగానే విజయ్ దేవరకొండకు రష్మిక బర్త్ డే విషెస్ చెప్పలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.