రష్మిక మందన్న ఎప్పుడైతే నేషనల్ క్రష్ అనిపించుకుందో అప్పటి నుంచే ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలో కూడా సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాక వీరి వివాహ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి అడపాదడపా కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉన్నాయి.

నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన మంచి స్నేహితులమని చాలా సార్లు చెప్పుకున్నారు. ఆ మధ్య ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక కనిపించడం ఆ తర్వాత మాల్దీవుల్లో రష్మిక ఎంజాయ్ చేసిన పిక్స్ బయటకు రావడంతో ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో హాలిడేస్ ఎంజాయ్ చేశారని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ మధ్య రష్మిక తన బర్త్ డే సైతం విజయ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందనే గుసగుసలూ వినిపించగా ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలు తెర మీదకు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి రష్మిక విజయ్ ఇంట్లో ఉన్న ఫోటో పెట్టేసి అడ్డంగా నెటిజనులకు చిక్కేసింది. ఈ మధ్య రష్మిక అసిస్టెంట్ సాయి వివాహం హైదరాబాద్‌లో జరగగా ఆ వేడుకకు పసుపు రంగు చీర కట్టులో వచ్చిన రష్మిక అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తరువాత ఆమె సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్టు పెట్టింది. అందులో ఆమె వేడుకకి సంబంధించిన ఫొటోలతో పాటు కొన్ని బాల్కనీ ఫొటోలు సైతం షేర్ చేశారు. ఈ పిక్స్ చూసి రష్మిక హైదరాబాద్‌లోని రౌడీ బాయ్ ఇంటికి వెళ్లిందని తేల్చేశారు నెటిజన్లు. ఇక ఈ అక్కడ బ్యాక్ గ్రౌండ్ చూసి నెటిజన్లు ఈ విషయాన్ని పట్టేశారు. గతంలో విజయ్ దిగిన ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న గోడ, రష్మిక యెల్లో శారీలో దిగిన ఫొటోలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న గోడ రెండూ ఒకటే కావడంతో అది విజయ్ దేవరకొండ ఇల్లు అని కన్ఫర్మ్ చేశారు.