Pushpa 2 నుంచి ఫొటో లీక్.. ఇలా అయితే సినిమా ఆడదన్న రష్మిక.. వాళ్లపై ఫైర్

- Advertisement -

Pushpa 2 పుష్ప-2 మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై లీక్ వీరులు కన్నేశారు. ఎంతో పకడ్బందీగా చిత్రీకరణ జరుగుతున్నా.. సినిమాలో అల్లుఅర్జున్ కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ఇకేముంది.. క్షణాల్లో వైరల్ గా మారింది. దీనిపై హీరోయిన్ రష్మికా మందన్న స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. అలా చేయొద్దని వేడుకుంది.

pushpa2
Pushpa 2

“షూటింగ్ సెట్ నుంచి నటీనటుల ఫోటోలు లీక్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సినిమా కోసం ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు. ముందే ఫోటోలు లీక్ చేేస్తే.. విడుదలైన తర్వాత ఆసక్తి ఉండదు. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. పుష్ప-2 భారీ అంచనాలు ఉన్నాయి. సరైన సమయంలో మీ ముందుకు వస్తుంది. మిమ్మల్నీ అలరిస్తుంది. సినిమా ప్రైవసీకి భంగం కలిగించవద్దు” అంటూ సోషల్ మీడియాలో రష్మిక అసహనం వ్యక్తం చేసింది. కాగా, పుష్ప-1 మూవీ కూడా లీక్ ల బెడదకు గురైంది. విడుదలకు ముందే ఓ సీన్ లీకైంది. తాజాగా ఇప్పుడు పుష్ప-2 నుంచి ఫోటోలు లీకవ్వడంతో చిత్రయూనిట్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మరింత పకడ్బందీగా షూటింగ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

2021 డిసెంబరులో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా ‘పుష్ప 2’ తెరకెక్కుతోంది. రష్మిక శ్రీవల్లిగా కనిపించనున్నారు. ‘పుష్ప’ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డురావడం, దేవిశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ‘పుష్ప 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here