Rashmika : పెళ్లి చేసుకోనంటూ బాంబు పేల్చిన రష్మిక.. ఆ విషయంలోనూ ఫైర్ అవుతోన్న బ్యూటీ!

- Advertisement -

Rashmika : కన్నడ భామ రష్మిక మందన్న జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. ఛలో చిత్రం నుంచి మొదలుపెడితే పుష్ప వరకు రష్మిక యాక్టింగ్ కు తిరుగులేదు. సోషల్ మీడియాలోనూ అమ్మడికి అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అభిమానులు పంపే సందేశాలతో రష్మిక ఉక్కిరిబిక్కిరి అయిపోతోందట. తాజాగా ఆమెను అభిమానులు ఏదైనా అప్ డేట్ ఉంటే పంచుకోవచ్చు కదా అని అడిగారు. అందుకు రష్మిక “పిచ్చెక్కిస్తానంతే” అంటూ సరదాగా బదులిచ్చింది.

Rashmika
Rashmika

ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉందని తెలిపింది. తాను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా చిత్రాలేనని వెల్లడించింది. పుష్ప-2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన, యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన… డీ-51లో ధనుష్ తో, రెయిన్ బో చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నానని, ఇవన్నీ బహుభాషా చిత్రాలేనని రష్మిక వివరించింది. ఇ కతన పెళ్లికి ఇంకా చాలా సమయం పడుతుందని స్పష్టం చేసింది రష్మిక. అటు హిందీలోనూ…ఇటు దక్షిణాదిలోనూ అవకాశాల్ని అందుకొంటూ దూసుకెళుతున్న ఈమె, మరికొంతకాలం కెరీర్‌పైనే దృష్టిపెట్టే ఆలోచనలో ఉంది.

రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన ‘యానిమల్‌’పై చాలా ఆశలే పెట్టుకుంది. మరోవైపు షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ఓ సినిమా కోసం రష్మిక ఎంపికవ్వగా, అది ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. దీనిపై రష్మిక స్పందిస్తూ అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల అభిమానులతో ముచ్చటించింది రష్మిక. ఈ సందర్భంగా పెళ్లి గురించి స్పందిస్తూ ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘యానిమల్‌’, ‘పుష్ప2’, ‘రెయిన్‌ బో’, ధనుష్‌ – శేఖర్‌ కమ్ముల సినిమాలన్నీ ఓ స్థాయిలో ఉంటాయని చెప్పింది రష్మిక.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here