హీరోయిన్ రష్మిక మందన్న గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి రష్మిక మందన్న అందరిని ఆకట్టుకుంది. నటనతో అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది రష్మిక. అయితే తెర మీద నవ్వులని పంచే హీరో హీరోయిన్లు నిజ జీవితంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం సహజం. కానీ తెర మీద నటులు ఎలా ఉన్నారు అనేది మనకి కనపడుతుంది తప్ప వాళ్ళ నిజ జీవితం లో జరిగే సంఘటనలు మనకి పెద్దగా తెలియవు.
రష్మిక కూడా నిజ జీవితం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. మేనేజర్ చేతి లో మోస పోయింది కూడా. మరి ఇక అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం… సినిమా పరిశ్రమ లో మేనేజర్ల మీద నమ్మకంతోనే హీరో హీరోయిన్లు ముందుకు వెళ్తారు. ఈ విషయం మనకి తెలుసు. నటుల యొక్క కెరియర్ నిలబడాలన్నా ముందుకు వెళ్లాలన్నా మేనేజర్ల కృషి ఎక్కువ ఉంటుంది. మేనేజర్ల కి కమిషన్ బేసెస్ మీద పారితోషకం ఉంటుంది.
హీరో లేదా హీరోయిన్ ఎదుగుదల కోసం వాళ్లు కృషి చేస్తారు. పైగా ఇంకో భాష హీరోయిన్ లో తెలుగు సినిమాల్లోకి అడుగు పెడితే మేనేజర్స్ ఏ అన్ని చూసుకుంటారు అయితే సినిమా ప్రయాణం లో ముందుకు వెళ్లి తర్వాత ఇబ్బందులు ఎదురు అయ్యి వాళ్లతో విభేదాలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా ఈ మధ్యనే మేనేజర్ ని పక్కన పెట్టేసారన్న వార్తలు వచ్చాయి.
రష్మిక మందన్న గురించి కూడా అదే వార్త వచ్చింది. చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి పోజిషన్ లోకి వెళ్ళింది రష్మిక. రష్మిక మేనేజర్ కి కూడా మంచి ఆదాయమే ఉంది అయితే ఆమె ని దారుణంగా మోసం చేశారని తెలుస్తోంది. దాదాపు 80 లక్షల రూపాయలు మేర అతను ఫ్రాడ్ చేశాడని వార్తలు వినపడుతున్నాయి. మోసం చేసి భార్యగా డబ్బులు తీసుకున్నాడు అని తెలుస్తోంది.