Rashmika Mandanna : వామ్మో.. రష్మిక డీప్ ఫేక్ వీడియో చేసింది తెలుగు వ్యక్తా.. నిందితుడిని అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు..

- Advertisement -

Rashmika Mandanna డీప్ ఫేక్ వీడియో కేసులో నిందితుడ్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హీరోయిన్‌ రష్మిక డీప్‌ ఫేక్‌ క్రియేట్‌ చేసింది ఏపీలోని గుంటూరు చెందిన యువకుడిగా గుర్తించారు దిల్లీ పోలీసులు. ఏపీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం రష్మిక డీప్ ఫేక్ వీడియో సినీ పరిశ్రమలో కలకలం రేపింది. హీరోయిన్ రష్మికను అభ్యంతరకరంగా చూపిస్తూ… డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Rashmika Mandanna
Rashmika Mandanna

తాజాగా ఈ వీడియో చేసిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ లో నటి రష్మిక మందన్నా డీప్‌ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్‌ జరాపటేల్‌ వీడియోను మార్ఫింగ్ చేసి రష్మిక ముఖాన్ని పెట్టారు. తొలుత ఆ వీడియోలో ఉన్నది రష్మిక మందన్నా అనుకున్నారు. కానీ డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్‌ చేసిన వీడియో అని గుర్తించి దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత రెండు నెలలుగా దర్యాప్తు చేసిన ముందు బిహార్‌కి చెందిన 19 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నటి రష్మిక మందన డీప్ ఫేక్ ప్రొఫైల్స్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టుపై డీసీపీ ఐఎఫ్‌ఎస్‌ఓ యూనిట్ హేమంత్ తివారీ మీడియాతో మాట్లాడారు.

Rashmika Mandanna Updates

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్ (24) ఈ కేసులో ప్రధాన నిందితుడని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల తనిఖీల్లో నిందితుడి ల్యాప్‌టాప్, మొబైల్ సీజ్ చేశామన్నారు. అతడు తొలగించిన డేటాను రికవరీ చేస్తున్నామన్నారు. నవీన్ సినీ నటి రష్మిక మందన్నా ఫ్యాన్ పేజీని నడుపుతున్నాడని తెలిపారు. అతడు మరో ఇద్దరు ప్రముఖ సెలబ్రిటీల పేరుతో రెండు ఫ్యాన్ పేజీలను కూడా సృష్టించాడన్నారు. నవీన్ తన ఫాలోవర్లను పెంచడానికి ఇలా నకిలీ వీడియోను సృష్టించాడన్నారు. తదుపరి విచారణ జరుగుతోందని హేమంత్ తివారీ తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here