Rashmika Mandanna డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించింది. ఆ వీడియో మీద చాలా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది. అయితే ఇదే వీడియోపై రష్మిక కూడా స్పందించారు. ఈ వీడియో తనను చాలా భాదించిందని రష్మిక చెప్పుకొచ్చింది. తన ఫేక్ వీడియో గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, ఈ విషయం తనకెంతో భయం కలిగించదని రష్మిక చెప్పుకొచ్చింది.
ఒక మహిళగా, నటిగా, నాకు మద్ధతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ రష్మిక తన సోషల్ మీడియాలోని ఓ ఖాతాలో పోస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే, ఈ ఘటన గురించి మరువక ముందే రష్మికకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు సంబంధించిన మరో మార్ఫింగ్ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఆమె అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కూడా ఫేక్ వీడియో అని రష్మిక అభిమానులు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కొందరు దుండగులు ఇలాంటి వీడియోలను క్రియేట్ చేస్తున్నారు.
అయితే ఇంతకుముందు వైరల్ అయిన రష్మిక వీడియోపై పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ అయినా సంగతి తెలిసిందే. అయినా, మళ్లీ మరో మార్పింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతుండడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రష్మిక వీడియో తర్వాత బాలీవుడ్ నటి కత్రీనాకైఫ్ ఫొటోలను కూడా మార్ఫింగ్ చేశారు. ఆమె తాజాగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ సినిమాలోని ఫైట్ సీన్లలోని ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేశారు.
Another AI video of #RashmikaMandanna now out on the internet.
— Sahil Saifi (@Sahilsa29) November 9, 2023
This AI must be stop😡#Rashmika #Oppenheimer#Salaar #Tiger3Booking #Top100MostBeautifulFaces #blackdiwaliforbankers #omegle #STR48 #AnanyaPanday #PPKrit #QudratKaNizam #SLvNZ #nzvsl#DiwaliBonus #Rose… pic.twitter.com/s0AsBEgCGG