Rashmi : యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసే రష్మి గౌతమ్, జంతువుల పట్ల ఎంతో ప్రేమతో ఉంటుంది. మూగ జీవాలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా వెంటనే తను స్పందిస్తుంది. వీధి కుక్కలు, ఇతరు జంతువుల పట్ల ఎవరు అమానుషంగా ప్రవర్తించినా సోషల్ మీడియా వేదికగా వారిపై విరుచుకుపడుతుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన తర్వాత యాంకర్ రష్మిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే, రష్మీ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెబుతూనే ఉంది. తాజాగా రష్మీ చేసిన మరో ట్వీట్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి.

రష్మీ చేసిన ట్వీట్ లో.. అతడు చాలా క్రూయల్.. అతని వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ప్రమాదమే. పిల్లలను లైంగికంగా వేధించేవాడు.. రేపిస్ట్ కూడా కావొచ్చు… అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బక్రీద్ పండుగ రోజున రష్మీ ఈ హింసను వ్యతిరేకించింది. ఇక ముస్లిం సోసైటీ కూడా ఆమెపై మండిపడుతోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలో బాలుడిపై కుక్కల దాడి జరగ్గా… రష్మీపై కూడా విమర్శలు వచ్చాయి.

రష్మీ లాంటి వాళ్ల వల్ల.. కుక్కలు పెరిగిపోతున్నాయంటూ కొంతమంది నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అయినా రష్మీ మాత్రం తగ్గలేదు. మూగా జీవల కోసం.. తన వంతు కృషి చేస్తూ వస్తోంది. రష్మీ విషయానికి వస్తే.. ప్యూర్ వీగన్. ఆమె మాంసం, గుడ్లే కాదు, పాలు, పాల పదార్థాలు కూడా తినదు. మరోవైపు రష్మీ యాంకర్ గా సత్తా చాటుతూనే… ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా చేస్తోంది. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. అది అంతగా ఆకట్టుకోలేదు.