Rashmi Gautam పెళ్లి ఫిక్స్.. అబ్బాయి ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?

- Advertisement -

యాంకర్ Rashmi Gautam గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన హాటు అందాలతో యువతను కట్టిపడేస్తూ, వచ్చి రాని తెలుగుతో జనాలకు బాగా దగ్గరైంది.. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతుంది.. అయితే ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.. ఆమె పెళ్లి ఫిక్స్ అయ్యిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.. అతను ఒక వ్యాపార వేత్త అని వినిపిస్తున్నాయి.. అంతేకాదు త్వరలోనే రష్మి తన పెళ్లిపై ప్రకటన ఇవ్వబోతోందని.. అలాగే తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేయనుందని వార్తలు వస్తున్నాయి.

Rashmi Gautam
Rashmi Gautam

ఇక సమ్మర్ లో గోవా వేదికగా డిస్టినేసన్ వెడ్డింగ్ చేసుకునేందుకు రష్మీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుందని టాక్ నడుస్తోంది.. గతంలో ఇలాంటి వార్తలు చాలానే వినిపించాయి.. అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు.. తాజాగా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. కాగా, రష్మీ విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. 2002లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు.

ఆ తర్వాత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది.. అంతేకాదు.. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసింది. అయితే సినిమాల ద్వారా రష్మీ కి అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు.. దాంతో జబర్దస్త్ కు యాంకర్ అయ్యి ఫెమస్ అయ్యింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.. మరోవైపు యాంకర్గా రానిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో రష్మీ ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here